»   » రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి.... మహేష్ బాబుకు లింకేంటి?

రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి.... మహేష్ బాబుకు లింకేంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ హీరోలతో వరుస అవకాశాలతో దూసుకెలుతున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఇటీవలే 'సరైనోడు' చిత్రంతో మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్న రకుల్ చేతి నిండా ప్రాజెక్టులతో దూసుకెలుతోంది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ ప్రీత్ సింగ్ కు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి రకుల్ గడుసుగా, ఎవరూ ఊహించని విధంగా సమాధానం ఇచ్చింది.


Mahesh-Rakul

సాధారణంగా ఏ హీరోయిన్ కు ఇలాంటి ప్రశ్న ఎదురైనా తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. తాము ఇపుడు విషయం గురించి ఆలోచించడం లేదనో...ఇంకేదో సమాధానం చెబుతారు. కానీ రకుల్ ప్రీత్ సింగ్ ఆసక్తికరంగా సమాధానం ఇచ్చింది.


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించే అవకాశం దక్కే వరకు పెళ్లి గురించి ఆలోచించనని తేల్చి చెప్పింది. దీన్ని బట్టి మహేష్ బాబు సినిమాలో అవకాశం కోసం రకుల్ ప్రీత్ సింగ్ ప్రయత్నిస్తోందని స్పష్టమవుతోంది. దీన్ని బట్టి మహేష్ బాబుకు అమ్మాయిల ఫాలోయింగ్ ఏ రేంజిలో ఉందో మరోసారి రుజువైంది.


ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ రామ్ చరణ్ కు జోడీగా 'ధ్రువ' చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు సాయి ధరమ్ తేజ్, విశాల్ తో సినిమాలు చేస్తోంది. మరి అమ్మడుకి మహేష్ బాబుతో అవకాశం దక్కేదెప్పుడో? పెళ్లి గురించి ఆలోచించేదెప్పుడో?

English summary
Gorgeous beauty Rakul Preet Singh said that she would not get married until she acts with Mahesh Babu. She went on saying that she may not get a chance to pair up with Mahesh if she announces her marriage.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu