రాంచరణ్, బోయపాటి మూవీ.. ఐటమ్ సాంగ్ కోసం స్టార్ హీరోయిన్!
Recommended Video

మెగా పవర్ స్టార్ రాంచరణ్, మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. అభిమానుల్లో మాత్రం ఈ చిత్రంపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. చరణ్, బోయపాటి చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్, సీనియర్ హీరోయిన్ స్నేహ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం గురించి తాజగా జరుగుతున్న ప్రచారం ఆసక్తి కలిగించే విధంగా ఉంది.

యాక్షన్స్ సీన్స్ కంప్లీట్
దర్శకుడు బోయపాటి ఈ చిత్ర యాక్షన్ సన్నివేశల చిత్రీకరణ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. సాంగ్స్, టాకీ పార్ట్ కూడా వీదిలైనంత త్వరలో పూర్తి చేయాలని భావిస్తున్నారు. బోయపాటి శైలిలో ఈ చిత్రంలో బలమైన యాక్షన్ సీన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

స్టార్ హీరోయిన్‌తో ఐటమ్ సాంగ్
బోయపాటి ఈ చిత్రంలో అదిరిపోయే ఐటమ్ సాంగ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఐటమ్ సాంగ్ కోసం స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది. అని కుదిరితే మరోమారు చరణ్ తో రకుల్ డాన్స్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కెమిస్ట్రీ అదుర్స్
ఇప్పటికే చరణ్ తో కలసి రకుల్ ప్రీత్ సింగ్ రెండు చిత్రాల్లో నటించింది. బ్రూస్లీ చిత్రం నిరాశపరచగా, ధృవ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ రెండు చిత్రాల్లో చరణ్, రకుల్ కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి.

కైరా అద్వానీతో రొమాన్స్
ఈ చిత్రంలో చరణ్ సరసన భరత్ అనే నేను బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications