దానికోసం కోట్లు కుమ్మరించిన రకుల్.. ఆమె ఆస్తి విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని పెద్దలు అంటుంటారు. సరిగ్గా అదే ఫార్ములా ఫాలో అవుతోంది రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్ సహా బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటిస్తూ ఇప్పటికే బిజినెస్ పరంగా అడుగులేసిన ఆమె.. తాజాగా మరో స్టెప్ తీసుకుందని తెలుస్తోంది. ఈ స్టెప్ అత్యంత ఖరీదైందని టాక్. ఇందుకోసం ఏకంగా ఆమె కోట్ల రూపాయలు కుమ్మరించిందట. ఇంతకీ రకుల్ తీసుకున్న ఆ స్టెప్ ఏంటి? వివరాల్లోకి పోతే..

బిజినెస్ ఆలోచనలకు పదును పెట్టిన రకుల్

బిజినెస్ ఆలోచనలకు పదును పెట్టిన రకుల్

నేటితరం హీరో హీరోయిన్లు కేవలం సినిమాలే గాక విభిన్న రంగాల్లో అడుగులేస్తుండటం చేస్తూనే ఉన్నాం. క్రేజ్ ఉన్నపుడే ఎంచక్కా అన్నీ సెట్ చేసుకోవాలనే కోణంలో వారి వారి ఆలోచనలు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలోనే యంగ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తనలోని బిజినెస్ ఆలోచనలకు మరింత పదును పెడుతోంది.

విలాసవంతమైన భవనం.. రకుల్ స్కెచ్

విలాసవంతమైన భవనం.. రకుల్ స్కెచ్

ముంబై నుంచి వచ్చి హైదరాబాద్ లో సెటిలైన రకుల్.. ఇప్పటికే ఇక్కడ ఎఫ్ 45 జిమ్‌లు నిర్వహిస్తూ కాసులు వెనకేసుకుంటోంది. ఇలా ఓ వైపు సినిమాలు,
మరోవైపు వ్యాపారం నడిపిస్తూ హైదరాబాద్ లో ఓ ఇల్లు కొనుకున్న ఈ బ్యూటీ తాజాగా మరో విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం.

ఇక్కడ కాదు అక్కడ

ఇక్కడ కాదు అక్కడ

ఇక హైదరాబాద్ చాలనుకున్న ఈమె మరో ఎంట్రో నగరంపై కన్నేసిందట. ఈ మేరకు బెంగళూరులో కూడా ఓ అదిరిపోయే ఫ్లాట్ తీసుకుందని తెలుస్తోంది. అది కూడా ఓ ఖరీదైన ఏరియాలో కొనేసిందట. దాని విలువ దాదాపు 6 కోట్లకు పైగానే ఉంటుందని, సకల సౌకర్యాలతో ఆ భవనం విలాసవంతంగా ఉంటుందని టాక్ నడుస్తోంది.

స్నేహితుల సలహాతో

స్నేహితుల సలహాతో

బెంగళూరులో ర‌కుల్‌కి కొంత‌మంది స్నేహితులు ఉన్నారు. వాళ్లిచ్చిన స‌ల‌హాలు, సూచ‌న‌లతోనే అక్కడ కూడా ఓ ఫ్లాట్ తీసుకుందని సమాచారం. బెంగళూరుకు షిఫ్ట్ కాకపోయినా అక్కడ కూడా ఆస్తి ఉంటుంది కదా అని తీసుకున్నట్లు టాక్. ఏదేమైనా రకుల్ ముందుచూపు, డేరింగ్ స్టెప్స్‌ చూసి షాక్ అవుతున్నారు టాలీవుడ్ ప్రేక్షకులు.

Recommended Video

#CineBox : Allu Arjun Is taking Huge Remuneration For Trivikram Srinivas's 'Ala Vaikuntapuramlo'?
రకుల్ సినీ జర్నీ

రకుల్ సినీ జర్నీ

ప్రస్తుతం చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నితిన్ సరసన నటిస్తోంది రకుల్. మరోవైపు హిందీలో వరస సినిమాలు చేస్తూ హంగామా చేస్తోంది. ఈ మధ్యే సిద్ధార్థ్ మల్హోత్రాతో మార్జవన్ సినిమాలో నటించింది రకుల్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X