For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నేను చేసిన తప్పేంటో..! దానికే అంతలా రియాక్ట్ కావాలా..? రకుల్ ప్రీత్ ఫైర్

|
Rakul Reacts To Trolls Who Slammed Her For Smoking Scene In Manmadhudu 2 || Filmibeat Telugu

నెటిజన్స్ ట్రోల్స్‌కి గురికావడం హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కి కొత్తేం కాదు. గతంలో ఎన్నోసార్లు నెటిజన్లు రకుల్ పై విరుచుకు పడ్డారు. అయితే అలాంటి అన్ని సందర్భాల్లో కూడా తనను తాను సపోర్ట్ చేసుకుంటూ నెటిజన్ల కామెంట్లకు దిమ్మతిరిగే రియాక్షన్స్ ఇచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. ఈ కోవలోనే మన్మథుడు 2 టీజర్ విషయంలో మరోసారి నెటిజన్ల కామెంట్స్‌కి బలై పోయింది రకుల్. అయితే తాజాగా ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడిన ఆమె ఈ విషయంపై మరోసారి ఘాటుగా స్పందించింది. ఇంతకీ రకుల్ రియాక్షన్ ఏంటి? వివరాల్లోకి పోతే..

రకుల్ కోసమే మన్మథుడు 2 సెపరేట్ టీజర్

రకుల్ కోసమే మన్మథుడు 2 సెపరేట్ టీజర్

మన్మథుడు 2 లో అవంతిక పాత్రలో నటిస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. ఈ పాత్రలో రెండు డిఫెరెంట్ కోణాల్లో రకుల్ పర్‌ఫార్‌మెన్స్ చూడనున్నారు ప్రేక్షకులు. అయితే ఈ క్రేజీ పాత్రను క్యాచ్ చేసుకొని సినిమాపై హైప్ తీసుకురావాలనే ఉద్దేశంతో రకుల్ క్యారెక్టర్‌ని ఎలివేట్ చేస్తూ సెపరేట్ టీజర్ కట్ చేసి రిలీజ్ చేసింది మన్మథుడు 2 టీమ్. ఇందులో రకుల్ ముందుగా పద్దతిగా కనిపించి, ఆ తర్వాత మెల్లగా తన విశ్వరూపం చూపించింది.

మరోసారి రకుల్‌పై నెటిజన్స్ ట్రోలింగ్

ఈ టీజర్ లో రకుల్ సిగరెట్ కాలుస్తున్న సన్నివేశాలు, ''ఇప్పటిదాకా U సర్టిఫికెట్ ప్రయత్నించాను. ఇప్పుడు A సర్టిఫికెట్ చూపిస్తా'' అని నాగార్జునతో రకుల్ చెప్పే డైలాగ్ బాగా హైలైట్ అయ్యాయి. అయితే కొందరు నెటిజన్లు మాత్రం వీటిపై ఫైర్ అవుతూ రకుల్‌ని విమర్శించారు. ఎందరో అమ్మాయిలకు రోల్‌మోడల్‌ గా ఉండాల్సిన మీరు ఇలా సిగరెట్ కాల్చడమేంటని తిట్ల పురాణం స్టార్ట్ చేశారు.

మీడియా ముందు రకుల్ రియాక్షన్

మీడియా ముందు రకుల్ రియాక్షన్

తాజాగా ఓ ఆంగ్ల మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో రకుల్.. తనపై వస్తున్న కామెంట్లను లైట్ తీసుకుంటున్నట్లుగా పేర్కొంది. ప్రజల పనే అది.. ఎప్పుడూ ఏదో ఒకటి అంటుండటం కామనే అని చెప్పింది. 'కబీర్‌ సింగ్‌'లో షాహిద్‌ కపూర్‌ సిగరెట్ తాగలేదా? క్యారెక్టర్ డిమాండ్ చేస్తే సిగరెట్ కాల్చడం తప్పా..? అయినా సినిమాను, నిజ జీవితాన్ని ఎందుకు ఇలా పోల్చి చూస్తున్నారో అర్థంకావడం లేదు అని రకుల్ పేర్కొంది. ఇంకా తెలియాలంటే సినిమా చూస్తే మీకే తెలుస్తుందని రకుల్ చెప్పింది.

మన్మధుడు 2 మూవీ

మన్మధుడు 2 మూవీ

గతంలో వచ్చిన మ‌న్మ‌థుడు సినిమా ఇన్‌స్పిరేష‌న్‌తో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘మన్మథుడు 2' చిత్రం తెరకెక్కుతోంది. చిత్రంలో కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా కీర్తి సురేష్, సమంత కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ‌నం ఎంట‌ర్‌ప్రైజ‌స్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌యాకామ్ 18 మోష‌న్ పిక్చ‌ర్స్ ప‌తాకాల‌పై నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్ (జెమిని కిర‌ణ్‌) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్టు 9న ఈ సినిమా విడుదల కానుంది.

English summary
Senior Hero Nagarjuna and Rakul Preet Singh is doing a new movie manmadhudu 2. This movie will release on August 9th. In movie pramotions manmadhudu 2 teaser released and got trollings from netijans. Rakul reacted on this issue.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more