రకుల్ ప్రీత్‌కు సారీ చెప్పండి.. ఆ వీడియోలు తొలగించండి..
దక్షిణాది స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు తనదైన శైలిలో మీడియాపై ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. గత రెండు నెలల క్రితం డ్రగ్స్ కేసులో సమన్లు అందుకొన్న విషయంలో మీడియా వెల్లడించిన కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టు ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంలో తనపై అనుచిత కథనాలు వెల్లడించిన మీడియాకు నోటీసులు జారీ చేశారు. ఈ వివాదంలో ఏం జరిగిందంటే..

ఢిల్లీ కోర్టులో పిటిషన్
బాలీవుడ్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో తనపై అనుచితంగా కథనాలు వెల్లడిస్తున్నాయి. తనపై కథనాలు రాకుండా తగు చర్యలు తీసుకోవాలని న్యూస్ బ్రాడ్ కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీని ఆదేశించాలని ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

మీడియా సంస్థలకు నోటీసులు
డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్‌పై ఆరోపణలు చేసిన నేషనల్ మీడియాకు చెందిన సంస్థలకు నోటీసులు జారీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ కేసులో రకుల్ ప్రీత్‌కు క్షమాపణలు చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నది. డిసెంబర్ 17 తేదీ లోపున క్షమాపణలు చెప్పాలని నోటీసులు జారీ చేసింది.

వీడియోలను తక్షణం తొలగించాలి
అంతేకాకుండా జాతీయ ఛానెల్స్‌కు సంబంధించిన య్యూట్యూబ్ వీడియోలను తక్షణం తొలగించాలి. వాటిపై వివరణ ఇవ్వాలి. రకుల్ ప్రీత్ విషయంలో రాసిన కథనాలపై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది అని నోటీసల్లో పేర్కొన్నారు. దీంతో రకుల్‌కు కాస్త ఊరట లభించింది.

టాలీవుడ్‌లో రకుల్ ప్రీత్ సింగ్
టాలీవుడ్‌లో కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల నాగార్జున అక్కినేనితో కలిసి రకుల్ ప్రీత్ నటించిన తెలుగు చిత్రం మన్మథుడు 2. ప్రస్తుతం నితిన్‌తో కలిసి చెక్ అనే చిత్రంలో నటిస్తున్నారు. 2021లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నది. అలాగే క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రంలో కూడా విభిన్నమైన పాత్రను పోషిస్తున్నది.
Recommended Video

బాలీవుడ్‌లో రకుల్ ప్రీత్ సింగ్
ఇక బాలీవుడ్ కెరీర్ విషయానికి వస్తే.. చేతి నిండా ప్రాజెక్టులు ఉన్నాయి. హిందీలో ఎటాక్, అయాల్‌యాన్, సర్దార్ అండ్ గ్రాండ్‌సన్, మేడే చిత్రాల్లో నటిస్తున్నారు. తమిళంలో కమల్ హాసన్‌తో కలిసి ఇండియన్ 2లో కనిపించనున్నారు. ఇంకా పలు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











