twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ హీరోలకు ఎముకల్లేవా.. అంతా అనుష్క చుట్టూనే.. రకుల్ ప్రీత్ సింగ్!

    |

    అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ జోరు కాస్త తగ్గింది. మునుపటిలా ఆమెకు టాలీవుడ్ లో ఆఫర్లు రావడం లేదు. టాలీవుడ్ లో మహేష్, రాంచరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి స్టార్స్ తో రకుల్ నటించింది. ఇటీవల రకుల్ కు కొన్ని పరాజయాలు ఎదురయ్యాయి. రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం మన్మథుడు 2లో నటిస్తోంది. తమిళ, హిందీ భాషల్లో కూడా కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ అజయ్ దేవగన్ సరసన నటిస్తున్న తాజాగా బాలీవుడ్ చిత్రం దే దే ప్యార్ దే. ఈ చిత్ర ట్రైలర్ బుధవారం విడుదలయింది. ఈ సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

    50 ఏళ్ల వ్యక్తితో ప్రేమ

    50 ఏళ్ల వ్యక్తితో ప్రేమ

    రకుల్ ప్రీత్ సింగ్ 'దే దే ప్యార్ దే' చిత్రంలో 50 ఏళ్ల వ్యక్తికి ప్రియురాలిగా నటిస్తోంది. టబు మరో హీరోయిన్ గా నటిస్తుండడం విశేషం. అకివ్ అలీ దర్శత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మే 17న విడుదల చేయనున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ గతంలో కూడా కొన్ని బాలీవుడ్ చిత్రాల్లో నటించింది. దే దే ప్యార్ దే బాలీవుడ్ లో తనకు మంచి క్రేజ్ తీసుకువస్తుందనే ఆశాభావంతో రకుల్ ఉంది.

     మొత్తం అనుష్క చుట్టూనే

    మొత్తం అనుష్క చుట్టూనే

    పురుషాధిక్యత గురించి పలు సందర్భాల్లో హీరోయిన్లు స్పందిస్తుంటారు. టాలీవుడ్ లో హీరోలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనే విమర్శపై రకుల్ తన అభిప్రాయం తెలిపింది. కొన్ని సంఘటనల వల్ల ప్రపంచం మొత్తం పురుషాధిక్యత ఉందని భావించవద్దు. ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్లకు ఎక్కువ ప్రాధాన్యత ఉండేలా అద్భుతమైన చిత్రాలు వస్తున్నాయి అని రకుల్ ప్రీత్ సింగ్ తెలిపింది. అందుకు బాహుబలి చిత్రాన్ని ఉందాహరణగా చూపించింది. బాహుబలి చిత్ర కథ మొత్తం అనుష్క చుట్టూనే తిరుగుతుంది. ఆమె పాత్రని చాలా బలంగా రచించారు అని రకుల్ తెలిపింది.

     వాళ్లకు ఎముకలు లేవా

    వాళ్లకు ఎముకలు లేవా

    ఇక టాలీవుడ్ లో ఎందరో అద్భుతమైన నటులు ఉన్నారు. రాంచరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రవితేజ లాంటి స్టార్లతో నటించా. వాళ్లంతా అద్భుతమైన డాన్సర్లు. మీ శరీరంలో ఎముకలు లేవా అని వారితో జోక్ చేస్తుంటా అని రకుల్ తెలిపింది. వాళ్లంతా చాలా సింపుల్ గా ఉంటారు కాబట్టే పేద స్టార్లుగా ఎదిగారు అని రకుల్ ప్రీత్ సింగ్ ప్రశంసించింది.

    మార్పు వస్తోంది

    మార్పు వస్తోంది

    భారత చిత్ర పరిశ్రమలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. నయనతార, అలియా, దీపికా పదుకొనె లాంటి హీరోయిన్లు అద్భుతంగా నటిస్తున్నారు. ఇప్పటికీ కొన్ని చోట్ల పురుషాధిక్యత ఉన్నమాట వాస్తవమే. కానీ గతం కంటే పరిస్థితులు మెరుగయ్యాయి అని రకుల్ తెలిపింది. రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఎన్ జి కె, మన్మథుడు 2 లాంటి చిత్రాల్లో నటిస్తోంది.

    English summary
    Rakul Preet Singh Responds on Male domination in Tollywood. Rakul Preet Singh interesting comments on Anushka Shetty, Ram Charan, NTR and Allu Arjun
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X