రకుల్ ప్రీత్ సింగ్‌పై పుకార్లు.. నన్నెవరూ అడ్డుకోలేరు అంటూ ఘాటుగా!
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ జోరు కాస్త తగ్గింది. మునుపటిలా ఆమెకు ఆఫర్లు రావడం లేదు. వరుసగా క్రేజీ చిత్రాల్లో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. చాలా మహేష్, రాంచరణ్, అల్లు అర్జున్,ఎన్టీఆర్ లాంటి స్టార్స్ తో నటించింది. వరుసగా పరాజయాలు ఎదురుకావడంతో రకుల్ ప్రీత్ సింగ్ జోరు బాగా తగ్గింది. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనపై వస్తున్న పుకార్లకు ఘాటుగా సమాధానం ఇచ్చింది. తన ఎదుగుదలకి అడ్డుకునేందుకే కొందరు ఇలాంటి వదంతులు సృష్టిస్తున్నారని రకుల్ సమాధానం ఇచ్చింది.

వరుసగా పరాజయాలు
తెలుగు, తమిళ భాషల్లో వరుస చిత్రాలు చేసిన రకుల్ కు మొన్నటివరకు తిరుగులేదు. టాలీవుడ్ లో కొన్ని హిట్స్, కొన్ని ప్లాపులు అన్నట్లుగా రకుల్ కెరీర్ కొనసాగుతూ వచ్చింది. కోలీవుడ్ లో మాత్రం రకుల్ ప్రీత్ సింగ్ కు సరైన రికార్డ్ లేదు. ఈ అమ్మడు నటించిన చిత్రాలు ఎక్కువగా నిరాశపరిచాయి. ఇటీవల కార్తీక్ సరసన నటించిన దేవ్ చిత్రం కూడా దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. దీనితో రకుల్ ప్రీత్ చేతిలో ఉన్న అవకాశాలు కూడా చేజారుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.

అంతంత మాత్రమే
ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ కు టాలీవుడ్ లో వస్తున్న అవకాశాలు అంతంత మాత్రమే. కోలీవుడ్ లో సూర్య సరసన ఎన్‌జికె, శివకార్తికేయన్ సరసన మరో చిత్రంలో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలపై రకుల్ భారీ ఆశలు పెట్టుకుని ఉంది. రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా రెండు చిత్రాల్లో నటిస్తోంది. ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్ భారీగా రెమ్యునరేషన్ పెంచేసిందని, అందువలనే ఆమె అవకాశాలు కోల్పోతోందని వార్తలు వస్తున్నాయి.

ఎవరూ అడ్డుకోలేరు
తాను పారితోషికం పెంచానంటూ వస్తున్న పుకార్లపై రకుల్ స్పందించింది. నా గురించి ఎన్నికట్టుకథలు ప్రచారం చేసినా నా ఎదుగుదలని ఎవరూ అడ్డుకోలేరు. ఇలాంటి పుకార్లని నేను పట్టించుకోను. తెలుగు, తమిళంతో పాటు హిందీలోకూడా బిజీగా ఉన్న కొద్దిమంది హీరోయిన్లలో తాను ఒకరిని అని రకుల్ ప్రీత్ చెబుతోంది. సామజిక మాధ్యమాల్లో ఎన్నో ప్రచారాలు జరుగుతుంటాయి. వాటన్నింటిని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని రకుల్ తెలిపింది.

మన్మథుడు 2లో
రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా నాగార్జున సరసన మన్మథుడు2లో అవకాశం దక్కించుకుందనే వార్తలు వస్తున్నాయి. రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ ఆమెకు పెద్ద బలం. మంచి విజయాలు రెండు పడితే రకుల్ ప్రీత్ సింగ్ హవా మళ్ళీ మొదలవుతుంది. తన తదుపరి చిత్రాలతో ఈ అమ్మడు ఏ మేరకు విజయాలు సాధిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











