Just In
- 2 hrs ago
‘అల.. వైకుంఠపురములో’ అరుదైన ఘనత.. వాళ్ల కోసం ప్రపంచంలోనే భారీ థియేటర్లో స్పెషల్ షో
- 3 hrs ago
గూగుల్ బెస్ట్ మూవీస్ లిస్ట్ రిలీజ్: ‘సాహో’కు షాక్.. తెలుగు సినిమా లేదు కానీ డైరెక్టర్ ఉన్నాడు
- 4 hrs ago
ఆ విషయాన్ని అంత తేలిగ్గా మర్చిపోయాడా.. మళ్లీ హీరోయిన్‌కు అవకాశం
- 4 hrs ago
రానా సమర్పణలో కొత్త సినిమా.. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో క్షణం దర్శకుడు
Don't Miss!
- News
జార్ఖండ్ లో మూడో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం..
- Sports
3rd T20లో టీమిండియా ఘన విజయం: 2-1తో సిరిస్ కైవసం
- Lifestyle
సుఖంగా నిద్రపోవాలి అంటే ఈ పోషకాహారాలను తప్పనిసరిగా తీసుకోండి..
- Technology
డిజిటల్ వ్యసనంలో పడితే ఈ భయంకరమైన చిక్కులు తప్పవు
- Automobiles
జావా మోటార్సైకిళ్లకోసం ఎదురుచూడాల్సిన కాలం కేవలం 5నెలలు మాత్రమే
- Finance
అన్నీ ఇచ్చాం: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం షాక్, కొత్త పథకాలతో రెవెన్యూ లోటు పెంచారు!
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
కాబోయే మొగుడు ఎలా ఉండాలంటే.. రహస్యం చెప్పేసిన రకుల్‌ప్రీత్ సింగ్
టాలీవుడ్, బాలీవుడ్ తెరలపై గ్లామర్ రోల్స్ పోషిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్. అందాలు ఆరబోసి మత్తెక్కిస్తూ భారీ ఫాలోయింగ్ కూడగట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం పలు బాషా చిత్రాల్లో నటిస్తున్నప్పటికీ సరైన విజయం దక్కించుకోలేక పోయింది. కాగా తాజాగా జరిగిన 'ఫీట్ అప్ విత్ ది స్టార్స్' షోలో కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది రకుల్. ఆ వివరాలు చూస్తే..

పడక గది రహస్యాలను బయటపెట్టే షో..
'ఫీట్ అప్ విత్ ది స్టార్స్' అనే పేరిట సెలెబ్రిటీల పడక గది రహస్యాలను బయటపెట్టే ఓ షో రన్ అవుతోంది. ఆన్లైన్ వేదిక అయిన వూట్ యాప్‌లో ప్రసారమయ్యే ఈ షోకి మంచు లక్ష్మి హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. సెలబ్రిటీల అంతరంగిక విషయాలను ప్రేక్షకులకు తెలియజేయాలనే కోణంలో ఈ కార్యక్రమం డిజైన్ చేశారు. తాజాగా ఇదే కార్యక్రమంలో రకుల్‌ప్రీత్ చేత సీక్రెట్స్ బటయపెట్టించింది మంచు లక్ష్మి.

యంగ్ హీరోయిన్స్.. ఒక్కరిదీ ఒక్కో కోరిక
'ఫీట్ అప్ విత్ ది స్టార్స్' షోలో భాగంగా ఇప్పటికే కొందరు యంగ్ హీరోయిన్స్‌ని ఇంటర్వ్యూ చేసిన మంచి లక్ష్మి వాళ్ళ సీక్రెట్ లాగేసింది. సమంత లాంటి టాలీవుడ్ టాప్ హీరోయిన్ చేత కూడా పడక గది రహస్యాలను బయటపెట్టించిన మంచు లక్ష్మి.. ఈ సారి రకుల్ ప్రీత్ సింగ్‌ని అస్సలు వదలలేదు. ఆమెకు సంబంధించి ప్రేమ, పెళ్లి విషయాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టి ఆ వివరాలు పట్టేసింది.

పెళ్లి చేసుకోవాలంటే.. కనీసం
ఇందులొ భాగంగా తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో కూడా చెప్పింది రకుల్ ప్రీత్ సింగ్. తనతో జీవితం పంచుకునే వాడు కనీసం ఆరడుగులైనా ఉండాలని తెలిపింది. అంతకంటే తక్కువైతే తనకు నచ్చదని, అంత హైట్‌తో పాటు తెలివైన వాడై కూడా ఉండాలని చెప్పింది. అలాంటి క్వాలిటీస్ ఉన్న వరుడు దొరికితేనే తాను పెళ్లి చేసుకుంటానని.. లేదంటే దొరికేదాకా వెయిట్ చేస్తానని రకుల్ తన మనసులోని మాట బయటపెట్టింది.

నాగార్జున, కమల్ హాసన్
ఇక రకుల్ సినిమాల విషయానికొస్తే.. టాలీవుడ్లో ఇటీవలే నాగార్జున సరసన 'మన్మథుడు 2'లో రొమాన్స్ చేసింది. ఇప్పుడు 'భారతీయుడు 2' సినిమాలో కమల్ హాసన్ సరసన నటిస్తోంది. అలాగే బాలీవుడ్లో 'మర్జవా' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రా, రితేశ్ దేశముఖ్, తారా సుతారియా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అతిత్వరలోనే మరోసారి ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ తెరలకు తన అందాలతో వన్నె తీసుకురానుంది రకుల్.