»   » తన సెక్సీ షేపుల సైజ్ వెల్లడించిన రకుల్ ప్రీత్ సింగ్

తన సెక్సీ షేపుల సైజ్ వెల్లడించిన రకుల్ ప్రీత్ సింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మోడలింగ్ రంగం నుండి వచ్చిన అమ్మాయిలు, లేదా హీరోయిన్లు తమ అందాల కొలతల గురించి మాట్లాడటానికి ఏ మాత్రం వెనకాడరు. అయితే మోడలింగ్ రంగం కాకుండా డైరెక్టుగా సినిమా రంగంలోకి వచ్చిన హీరోయిన్లు మాత్రం ఈ విషయం గురించి పబ్లిక్ గా చర్చించడానికి తటపటాయిస్తారు.

ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా వెలిగి పోతున్న రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల ట్వీట్టర్లో అభిమాని అడిగిన ప్రశ్నకు వెంటనే సమాధానం ఇచ్చింది. ఆ అభిమాని అడిగింది ఆమె సెక్సీ అందాల కొలతల గురించి కావడం గమనార్హం. ‘మీరు ఎప్పటికైనా సైజ్ జీరో ను ప్రిపర్' చేస్తారా? అని ఓ అభిమాని రకుల్ కు ప్రశ్న సంధించాడు.

Rakul Preet Singh Reveals Her Size!

అభిమాని ప్రశ్నకు రకుల్ ప్రీత్ సింగ్ సమాధానం ఇస్తూ...‘సైజ్ జీరో ఆరోగ్యానికి అంత మంచిది కాదు. నేనే సైజ్ 6' అంటూ సమాధానం ఇచ్చింది. మహిళల్లో సైజ్ సిక్స్ అంటే 31-24-36 కొలతలు అని అర్థం. తమ సైజుల గురించి హీరోయిన్లు ఇలా ఓపెన్ గా మాట్లాడటం చాలా అరుదు. రకుల్ ప్రీత్ సింగ్ ఇలాంటి విషయాల్లో డేరింగే అని చెప్పొచ్చు.

కొందరు అభిమానులు ఆమెను ఐ లవ్ యూ, నీవు ఎలాంటి వాళ్లతో డేటింగ్ చేస్తావ్ అంటూ రొమాంటిక్ ట్వీట్స్ తో నానాహంగామా చేస్తున్నారు. అలాగే ఎప్పుడూ రాత్రిళ్లే కలలోకి వస్తుంటావ్ ఎందుకని ఓ అభిమాని అడిగిన కొంటె ప్రశ్నకు.. తెలివిగా సమాధానం చెప్పింది అమ్మడు. రోజంతా షూటింగ్ లో బిజీగా ఉంటాను కదా.. అందుకే రాత్రిళ్లే కల్లోకి వస్తా అని షాకింగ్ ఆన్సర్ ఇచ్చి అదరగొట్టింది రకుల్. లుక్స్ లోనే కాదు.. లౌక్యం తెలిసిన అమ్మాయి కాబట్టే.. ఇంత క్రేజ్ సంపాదించుకుందని రకుల్‌కు కాంప్లిమెంట్స్ పడుతున్నారు.

రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ‘బ్రూస్ లీ' చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ కు గ్లామర్ పరంగా మంచి మార్కులే పడ్డాయి. అందాల ఆరబోత విషయంలో రకుల్ ప్రీత్ సింగ్ కాస్త దూకుడుగానే ముందుకు వెళుతోందని అంటున్నారు సినీ జనాలు.

English summary
Rakul Preet Singh Reveals Her Size, when she is promoting "Bruce Lee" after the release, 'would you prefer to go Size Zero one day?". Probably she looked quite fragile and thin in Ram Charan's movie and for that reason that question has come. In a pat, Rakul replied, "Size Zero is not good for health, by the way I'm Size 6".
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu