సుక్కు మూవీ: జూ ఎన్టీఆర్‌తో ఢిల్లీ బ్యూటీ రొమాన్స్
హైదరాబాద్: ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ అందం, అభినయంతో వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెలుతోది. స్టార్ హీరోల సైతం ఆమెపై ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే రాకుల్ ప్రీత్ సింగ్ 3 చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా ఆమెకు మరో భారీ ఆఫర్ దక్కినట్లు తెలుస్తోంది.
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ సినిమాలో ఆమె ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో జూ ఎన్టీఆర్ చేయబోతున్న చిత్రంలో యాక్షన్ ఎంటర్టెనర్లో ఆమెను ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ దర్శకత్వం వహించబోతున్నారు.

తన కథకు సెట్ అయ్యే హీరోయిన్ కోసం గత కొంత కాలంగా వెతుకుతున్న సుకుమార్ ఎట్టకేలకు రకుల్ ప్రీత్ సింగ్‌ను ఫైనల్ చేసాడు. ప్రస్తుతం జూ ఎన్టీఆర్ ‘టెంపర్' షూటింగులో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత సుకుమార్ దర్శకత్వంలో సినిమాకు సన్నద్ధం కాబోతున్నాడు.
వాస్తవానికి ఈ చిత్రం జనవరి మొదటి వారంలోనే ప్రారంభం కావాల్సి ఉంది. అయితే అనుకోని సంఘటనల కారణంగా ‘టెంపర్' మూవీ షూటింగ్ లేటు కావడంతో ఈ చిత్రం ప్రారంభం కూడా మరికొన్ని రోజులు వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ చిత్రాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











