రకుల్ ప్రీత్ సినిమాకు సెన్సార్ చిక్కులు.. దేవుడో పద్మావతి పట్టిన గతేనట..

By Rajababu

పద్మావత్ చిత్రం తర్వాత బాలీవుడ్‌లో మరో చిత్రం సెన్సార్ చిక్కుల్లో పడింది. రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్ మల్హోత్రా, మనోజ్ బాజ్‌పేయ్ నటించిన ఐ యారీ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ నిరాకరించినట్టు సమాచారం. ముందుగా ప్రకటించిన ప్రకారం ఐ యారీ చిత్రం ఫిబ్రవరి 9వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది. ఇటీవల కాలంలో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన పద్మావత్ చిత్రం సెన్సార్ ఇబ్బందుల కారణంగా రిలీజ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే.

 ఐ యారీ రిలీజ్‌ ప్రశ్నార్థకం

ఐ యారీ రిలీజ్‌ ప్రశ్నార్థకం

ఐ యారీ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ లభించకపోవడంపై చిత్ర యూనిట్ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. వాస్తవానికి ఐ యారీ చిత్రం జనవరి 26న రిలీజ్ కావాల్సింది. అయితే పద్మావతి అదే రోజున రిలీజ్‌ అవుతున్న నేపథ్యంలో ఫిబ్రవరి 9వ తేదీకి వాయిదా వేశాం. మా సినిమా రిలీజ్‌కు వారం రోజులే ఉంది. కానీ ఇంకా సెన్సార్ సర్టిఫికెట్ లభించలేదు.

దేవుడిపై భారం వేసి..

దేవుడిపై భారం వేసి..

పద్మావతి చిత్రానికి ఎదురైన పరిస్థితులే మా చిత్రానికి కూడా ఎదురవుతున్నాయి. ఐ యారీ చిత్రానికి సెన్సార్ రిపోర్టు ఇంకా పెండింగ్‌లో ఉంది. మా చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఎప్పుడు లభిస్తుందో దేవుడికే తెలియాలి అని చిత్ర యూనిట్‌ ఆందోళన వ్యక్తం చేసింది.

 నీరజ్ పాండే దర్శకత్వంలో

నీరజ్ పాండే దర్శకత్వంలో

ఐ యారీ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు నీరజ్ పాండే రూపొందిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్నది. ఆయుధాల ఒప్పందాలు, కుట్రలు, మిలిటరీ విభాగంలో తెర వెనుక జరిగే భాగోతాలను నీరజ్ పాండే తెరకెక్కించినట్టు సమాచారం.

 రక్షణశాఖ మోకాలడ్డు

రక్షణశాఖ మోకాలడ్డు

మిలిటరీ కథా నేపథ్యంతో ఐ యారీ చిత్రం రూపొందినందున తమ ఎదుట ప్రదర్శించాలని, ఆ తర్వాత సర్టిఫికెట్ జారీ చేయాలని సెన్సార్ అధికారులను రక్షణశాఖ కోరినట్టు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఐ యారీ చిత్రాన్ని రక్షణ అధికారులు చూడనందున సర్టిఫికెట్ జారీ చేయలేదనే వార్త వినిపిస్తున్నది.

క్లీన్ చిట్ వస్తేగానీ..

క్లీన్ చిట్ వస్తేగానీ..

రక్షణశాఖ నుంచి క్లీన్ చిట్ వస్తే గానీ ఐ యారీ చిత్ర విడుదల అయ్యే పరిస్థతి కనిపిస్తున్నది. ఈ చిత్రాన్ని రక్షణశాఖ అధికారులు ఎప్పుడు చూస్తారో అనే విషయంపై క్లారిటీ లేదు. దాంతో ఈ సినిమా రిలీజ్‌కు సంబంధించిన అంశాన్ని దేవుడిపైనే వేశామని చిత్ర యూనిట్ పేర్కొంటున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X