»   »  ఏ హీరో కొనివ్వలేదంటూ రకుల్ మండిపాటు, ఆ ఆత్మహత్యపై కూడా...

ఏ హీరో కొనివ్వలేదంటూ రకుల్ మండిపాటు, ఆ ఆత్మహత్యపై కూడా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్... అతి తక్కువ కాలంలోనే తెలుగులో ఓ రేంజికి ఎదిగిన హీరోయిన్. తన అందం, టాలెంటుతో తెలుగులో స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెలుతోంది. దాదాపు ఆరేడు సంవత్సరాల క్రితమే రకుల్ హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టింది. అయితే 2013లో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తర్వాత అమ్మడు దశ తిరిగింది. వరుసగా అవకాశాలు వచ్చి పడ్డాయి.

ఈ మూడేళ్ల కాలంలో ఎన్టీఆర్, రామ్ చరణ్, రవితేజ, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో నటించే అవకాశం దక్కించుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో సొంతంగా ఇల్లు కొనుక్కోవడంతో పాటు ఇక్కడ జిమ్ బిజినెస్ కూడా మొదలు పెట్టింది. ఇక్కడే సెటిలయ్యేందుకు ఫిక్స్ అయింది. దీన్ని బట్టి రకుల్ సంపాదన తెలుగు సినీ పరిశ్రమలో ఏ రేంజిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

అయితే రకుల్ ప్రీత్ సింగ్ హైదరాబాద్ లో ఇల్లు కొనడంపై ఓ రూమర్ స్ర్పెడ్ అయింది. రకుల్ కు ఓ హీరో ఇల్లు కొనిచ్చాడని ఆ రూమర్ సారాంశం. ఈ విషయమై ఆమె మీడియాలో సమావేశంలో స్పందింస్తూ మండి పడ్డారు. రూపాయి రూపాయి కూడబెట్టుకుని నా కష్టార్జితంతో సంపాదించిన ఇంటిని వేరెవరో హీరో నాకు ఇచ్చారంటే బాధ అనిపించింది అని రకుల్ చెప్పుకొచ్చింది.

ఇల్లు విషయంలో ఇలాంటి ప్రచారం జరుగుతున్న విషయం మా నాన్నకు కూడా చెప్పాను. ఆ ఇల్లు కొనేప్పుడు ఆయన కూడా ఉన్నారు. ఇలాంటివేవీ పట్టించుకోవద్దు అంటూ ధైర్యం చెప్పారు. ఆ ఇల్లు కొనడానికి మా నాన్న బ్యాంక్ లోన్ కూడా తీసుకున్నారు. ఈ విషయం ఆయనే స్వయంగా చెబితేగానీ ఎవరూ నమ్మరేమో అంటూ తన మనసులోని ఆవేదనను బయట పెట్టింది.

ఇటీవల ఆత్మహత్య చేసుకున్న 'చిన్నారి పెళ్లి కూతురు' టీవీ సీరియల్ నటి అంశంపై కూడా ఆమె స్పందించారు. స్లైడ్ షోలో రకుల్ ప్రీత్ సింగ్ చెప్పిన మరిన్ని ఆసక్తికర విషయాలు...

ఆత్మహత్య పై..

ఆత్మహత్య పై..


చిన్నారి పెళ్లి కూతురు నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్యపై స్పందిస్తూ..సినీరంగంలో అవకాశాలేక పోవడం, మరే ఇతర కారణాలైనా డిప్రెషన్‌కు గురయ్యే పరిస్థితి వచ్చే నా చుట్టూ ఫ్రెండ్స్ ఉండేలా చూసుకుంటాను. ఫ్యామిలీకి దగ్గరగా వెళ్లి పోతాను అని రకుల్ చెప్పింది.

మెగా హీరో అనే కారణం కాదు..

మెగా హీరో అనే కారణం కాదు..


మెగా ఫ్యామిలీకి చెందిన హీరో అనే కారణంతో సాయి ధరమ్ తేజ్ తో చేసే చిత్రం కోసం పారితోషికం తగ్గించుకున్నానని రాసారు. ఇదంతా అవాస్తవం. ఇలాంటి వార్తలను నేను పట్టించుకోను అన్నారు.

సరైనోడు..

సరైనోడు..


త్వరలో విడుదల కాబోతున్న సరైనోడు లో తాను మహాలక్ష్మి పాత్ర చేస్తున్నట్లు రకుల్ తెలిపారు.

సరనోడులో తన పాత్ర గురించి..

సరనోడులో తన పాత్ర గురించి..


సరైనోడు చిత్రంలో నేను డీగ్లామరైజ్డ్ పాత్రలో చేస్తున్నాను. ఈ పాత్ర చాలా భిన్నంగా ఉంటుందని ఆమె తెలిపారు.

English summary
Rakul Preet Singh has purchased a house in Hyderabad city, rumors erupted that a top hero has gifted her that house. When questioned, Rakul said that she doesn’t know where such rumors have erupted from. She added that she had purchased that home with her own savings and she even took a loan on her father’s name. She even volunteered to show loan papers to prove her point.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X