రకుల్ ప్రీత్ సిగరెట్ సీన్లు...నీ భర్త చేసేది తప్పుకాదా? చిన్మయిపై ట్రోల్స్!

నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న 'మన్మధుడు 2' మూవీకి సంబంధించిన లేటెస్ట్ టీజర్ శుక్రవారం విడుదలైంది. ఈ టీజర్ ద్వారా రకుల్ పోషించిన అవంతిక పాత్రను పరిచయం చేశారు. అయితే ఈ టీజర్ విడుదలైన తర్వాత ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ ప్రారంభమైంది.

'మన్మధుడు 2' చిత్రానికి చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తుండటమే ఈ ట్రోలింగ్ జరుగడానికి ప్రధాన కారణం. టీజర్లో రకుల్ పొగత్రాగుతూ కనిపించారు. ఇలాంటి సీన్ పెట్టడం ద్వారా నీ భర్త సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారు అంటూ కొందరు కామెంట్స్ చేయడం ప్రారంభించారు.

చిన్మయి ‘కబీర్ సింగ్' వ్యాఖ్యలకు నెటిజన్ల కౌంటర్

చిన్మయి ‘కబీర్ సింగ్' వ్యాఖ్యలకు నెటిజన్ల కౌంటర్

ఇంతకు ముందు చిన్మయి... ‘‘సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘కబీర్ సింగ్' చిత్రంలో మహిళలపై హింసాత్మక సన్నివేశాలు ఉండటాన్ని తట్టుబట్టారు. ఆమె అనుమతి లేకుండా భర్త అయినా సరే టచ్ చేయడానికి వీల్లేదు, మహిళలను కొట్టడం, అది ప్రేమించడంలో భాగమే అని చూపించడం ఆయోదయోగ్యం కాదు'' అంటూ మండిపడ్డారు.

ఇపుడు వారికి అవకాశం దొరికినట్లయింది

ఇపుడు వారికి అవకాశం దొరికినట్లయింది

‘కబీర్ సింగ్' మూవీ గురించి చిన్మయి చేసిన ట్వీట్లపై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగింది. సినిమాను సినిమాగా చూడాలని, ఇలా ప్రతి విషయాన్ని తప్పుబడుతూ వెళితే సినిమాలు చేయలేరు అంటూ కొందరు చిన్మయి తీరును తప్పుబట్టారు. ఇపుడు చిన్మయి భర్త దర్శకత్వంలో రూపొందుతున్న ‘మన్మధుడు 2'లో రకుల్ స్మోకింగ్ సీన్లు ఉండటంతో వారికి అవకాశం దొరికినట్లయింది.

మీ భర్త సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారు?

మీ భర్త సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారు?

మీరు, మీ భర్త చాలా నీతులు చెబుతున్నారు. మరి మీ భర్తగారు తన సినిమాలో చూపిస్తున్నది ఏమిటి? ‘మన్మధుడు 2' టీజర్లో రకుల్ స్మోకింగ్ సీన్ చూపడం ద్వారా అమ్మాయిలు పొగతాగాలని ఎంకరేజ్ చేస్తున్నారా? హీరోయిన్ బటన్ విప్పడం, ప్లర్టింగ్ చేయడం చూపిండం ద్వారా ఈ సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారు? అంటూ సింగర్ చిన్మయి మీద కొందరు నెటిజన్లు విరుచుకుపడ్డారు.

మన్మధుడు 2

మన్మధుడు 2

‘మన్మధుడు 2' సినిమా గురించి వివరాల్లోకి వెళితే... రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. సమంత అతిథి పాత్రలో కనిపించబోతోంది. అక్కినేని నాగార్జున తన అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్లో వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ సంస్థలతో కలిసి నిర్మిస్తున్నారు. ఆగస్టు 9న ఈ మూవీ విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X