కూకట్‌పల్లిలో కూరగాయలు అమ్మిన రకుల్ ప్రీత్ సింగ్
హైదరాబాద్: హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూకట్ పల్లిలో కూరగాయలు అమ్మింది. మీరు విన్నది నిజమే. ఇదేదో సినిమా షూటింగ్ అనుకుంటే పొరపాటే. పలువురు అభిమానులు ఆమె వద్దకు వెళ్లి కూరగాయలు కొనుగోలు చేసారు. కెబిహెచ్‌బి కాలనీలోని మంజీరామాల్ లో ఆమె కూరగాయల దుకాణం తెరిచారు.

ఈ విషయం రకుల్ ప్రీత్ సింగ్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. ‘నేను కెబిహెచ్‌బి కాలనీలోని మంజీరా మాల్ లో ఉదయం 10 గంటల నుండి కూరగాలు అమ్ముతున్నాను. మంచు లక్ష్మి షో ‘మేము సైతం' కోసం ఈ నిర్ణయం తీసుకున్నాను. మీరు ఇక్కడ వెజిటబుల్స్ కొనడం ద్వారా ఎంతో మంది జీవితాలు మారుతాయి' అని తెలిపారు.
I will b at KPHB market opp Manjeera mall sellin vegetables 4 lakshmis show #memusaitham.lts change lives come buy vegetables from me.10am
Posted by Rakul Preet onFriday, February 5, 2016
‘మేము సైతం' పేరుతో మంచు లక్ష్మి సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. సెలబ్రిటీ ద్వారా కూరగాయలు అమ్మడం లాంటి ఫండ్ రైజింగ్ కార్యక్రమాలు మొదలు పెట్టారు. ఈ కార్యక్రమాల ద్వారా వచ్చే డబ్బును సేవా కార్యక్రమాలకు వినియోగించే ఏర్పాటు చేసినట్లు సమాచారం.
మేము సైతం పేరుతో టాలీవుడ్ సినీ కళాకారులు గతంలో పలు కార్యక్రమాలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇది ఏదో ఒక సందర్భానికి పరిమితం కాకుండా నిరంతంర కొనసాగించే విధంగా వివిధ కార్యక్రమాలతో మంచు లక్ష్మి ముందుకు సాగుతున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











