twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చే వాళ్ళకు రకుల్ హెచ్చరిక.. గుర్తుపెట్టుకొని రండి జాగ్రత్త!

    |

    గ్లామరస్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఏం మాట్లాడినా కూడా కాస్త విబిన్నంగా ఉంటుంది. అలాగని ఎక్కువగా కాంట్రవర్సీల జోలికి వెల్లదు. కెరీర్ లో సక్సెస్ ఫెయిల్యూర్స్ సంగతి పక్కన పెడితే ఈ బ్యూటీ మాత్రం ఎప్పుడు కూడా పెద్ద స్థాయిలో వివాదాలను టచ్ చేసింది లేదు. కానీ అప్పుడప్పుడు ఏదైనా సామాజిక అంశాలపై స్పందించాల్సి వస్తే మాత్రం ఓపెన్ గానే తన స్టేట్మెంట్ ఇస్తుంటుంది. ఇక ఇటీవల నెపోటిజమ్ పై కూడా ఎవరు ఊహించని విదంగా స్పందించింది. ఒక విదంగా ఆమె బ్యాక్ గ్రౌండ్ తో వచ్చే వారికి హెచ్చరిక జారీ చేసిందని చెప్పవచ్చు.

    మోడలింగ్ డేస్ లోనే

    మోడలింగ్ డేస్ లోనే

    రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ మొదటి నుంచి కూడా బిన్నంగానే సాగుతోంది. మోడలింగ్ డేస్ లోనే హాట్ లుక్స్ తో కనిపించి అప్పట్లో ముంబై మ్యాగజైన్ లలో కూడా మెరిసిపోయేది. కానీ ఆమెను ఎక్కువగా ఆదరించింది మాత్రం టాలీవుడ్ జనాలే. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకోని ఆ తరువాత పెద్ద సినిమాల వరకు వచ్చింది.

    ఆ ఒక్క సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్

    ఆ ఒక్క సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్

    ఎలాంటి సినిమా చేసినా కూడా తన పాత్రకు ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉండాలని మొదట్లో చాలా జాగ్రత్తలు తీసుకున్న రకుల్ ఆ తరువాత కొన్ని సినిమాలను ఒప్పుకొని మిస్టేక్ చేసింది. ముఖ్యంగా రకుల్ కెరీర్ లో స్పైడర్ సినిమా అనేది ఒక మైనెస్ అనే చెప్పాలి. .మహేష్ బాబు - మురగదాస్ కాంబినేషన్ అని ఒప్పుకున్న ఈ బ్యూటీ కథలో బలం లేకపోయినా కూడా ఒప్పుకొని డిజాస్టర్ ను అందుకుంది.

    సిగరెట్ తాగుతూ..

    సిగరెట్ తాగుతూ..

    అనంతరం మన్మథుడు 2 సినిమా కూడా ఈ బ్యూటీకి బిగ్గెస్ట్ మైనస్ గా నిలిచింది. ఆ సినిమాలో రకుల్ సిగరెట్ తాగుతూ కనిపించడం అలాగే ఝాన్సీకి లిప్ లాక్ ఇవ్వడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఆ సినిమా అనంతరం రకుల్ కు ఒక్కసారిగా అవకాశాలు తగ్గిపోయాయి. ఇక అదృష్టం కొద్దీ బాలీవుడ్ లో కూడా వరుసగా ఆఫర్లు రావడం వలన మళ్ళీ తెలుగులో కూడా ఛాన్సులు వస్తున్నాయి.

    బ్యాక్ గ్రౌండ్ ఉంటే..

    బ్యాక్ గ్రౌండ్ ఉంటే..

    అయితే ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్ నెపోటిజమ్ పై ఎవరు ఊహించని విధంగా కామెంట్ చేసింది. నిజానికి బ్యాక్ గ్రౌండ్ ఉన్నంత మాత్రనా వాళ్ళు ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారని తాను అనుకోని ఓపెన్ గానే చెప్పేసింది. ఇండస్ట్రీలో నిత్యం ఇది వినిపిస్తునే ఉంటుందని ఎవరైతే వారికంటు ఒక టాలెంట్ ను క్రియేట్ చేసుకుంటారో వారే ఎక్కువ కాలం ఉంటారని వివరణ ఇచ్చింది.

    ప్రేక్షకులకు నచ్చితేనే..

    ప్రేక్షకులకు నచ్చితేనే..

    బ్యాక్ గ్రౌండ్ ఉంటే కొన్ని అవకాశాలు వస్తాయి గాని ఆ తరువాత ఎప్పటికి కూడా బ్యాక్ గ్రౌండ్ పనిచేయదని విజయాలు కూడా సొంతంగానే అందుకోవాలని రకుల్ తనదైన శైలిలో వివరణ ఇచ్చింది. ముఖ్గ్యంగా ప్రేక్షకులకు నచ్చితే టాలెంటెడ్ ఉన్న వారికి ఎవరు చెప్పినా చెప్పకపోయినా కూడా సపోర్ట్ చేస్తారని కూడా తెలిపింది. నిజంగా రకుల్ చెప్పింది ఒక మంచి హెచ్చరిక లాంటిది అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

    English summary
    Glamorous beauty Rakul Preet Singh says is also a bit different. As such, most controversies do not go unnoticed. Successes and failures in her career aside, this beauty has never touched on a large scale. But he occasionally gives his statement openly when he has to respond to any social issues. And even more recently on Nepotism who has reacted in an unexpected way. In a way she issued a warning to those who came with the background.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X