అనుమానం ఎక్కువైంది.. వారి వల్ల షూటింగ్‌లో ఇబ్బందులు.. రకుల్ షాకింగ్ కామేంట్స్
టాలీవుడ్ టాలెంటెడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో సక్సెస్ చూసి చాలా కాలమవుతోంది. సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా ఈ బ్యూటీకి ఛాన్సులు ఏమి తగ్గట్లేదు. ఏడాదికి రెండు మూడు సినిమాలతో బిజిగానే ఉంటోంది. ఇక ప్రస్తుతం షూటింగ్స్ లో రకుల్ ఒక విషయంలో బాగా ఇబ్బంది పడుతోందట. కొందరిపై అనుమానాలు కూడా ఎక్కువవుతున్నాయని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.

పెద్ద సినిమాలు డిజాస్టర్ కావడంతో
రకుల్ ప్రీత్ సింగ్ 2009 నుంచి సినిమా ఫీల్డ్ లో కొనసాగుతోంది. ఫామ్ లోకి రావడానికి ఈ బ్యూటీ చాలానే హార్డ్ వర్క్ చేసింది. మొదట కంటెంట్ ఉన్న చిన్న సినిమాలను చేసి ఆ తరువాత అగ్ర హీరోల కమర్షియల్ సినిమాల్లో ఛాన్సులు కొట్టేసింది. అయితే ఆమె చేసిన కొన్ని పెద్ద సినిమాలు డిజాస్టర్ కావడంతో ఆమె కెరీర్ పై కొంత ఎఫెక్ట్ అయితే పడింది. మొన్న వచ్చిన నితిన్ చెక్ సినిమా కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు.

రెగ్యులర్ సినిమాలను కాకుండా
స్పైడర్ సినిమాతో పాటు ఎన్నో ఆశలు పెట్టుకున్న మన్మథుడు 2 సినిమా కూడా రకుల్ ఆశలను ఆవిరి చేశాయి. ఇక బ్యాక్ టూ బ్యాక్ డిజాస్టర్స్ రావడంతో రకుల్ కొంత అప్సెట్ అయ్యింది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను కాకుండా కొత్త తరహా కథలను సెలెక్ట్ చేసుకోవాలనే విధంగా అడుగులు వేస్తోంది.

అనుమానాలు
ఇక ఇటీవల ఈ బ్యూటీ కొందరి వల్ల ఇబ్బంది పడుతున్నట్లు చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. రోజురోజుకు అనుమానాలు కూడా ఎక్కువవుతున్నాయని అయినా కూడా తప్పట్లేదని చెప్పింది. ప్రస్తుతం కరోనా ఎక్కువవుతున్న తరుణంలో కొంతమంది జనాలు మాస్క్ లేకుండా కనిపిస్తే అనుమనించాల్సి వస్తోందని రకుల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది.
Recommended Video

ఇబ్బందిగా అనిపిస్తోంది
కెమెరా ముందుకు వెళ్లేటప్పుడు మేము మాస్క్ పెట్టుకోవడానికి వీలు ఉండదు. బ్రేక్ టైమ్ లో పెట్టుకోవాలని అనుకుంటే మళ్ళీ మేకప్, హెయిర్ మొత్తం మారిపోతుంది. అందుకే మాస్క్ ను ధరించలేము. ఇక షూటింగ్ లో ఎవరైనా మాస్ లేకుండా కనిపిస్తే మాత్రం అనుమనించాల్సి వస్తోంది. తన చుట్టూ ఉన్న వాళ్ళపై ఆ విధంగా డౌట్ పడటం ఇబ్బందిగా అనిపిస్తున్నట్లు రకుల్ వివరణ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











