twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కొడుకుకు హ్యాండించి.. తండ్రికి గ్రీన్ సిగ్నల్.. హాట్ టాపిక్‌గా రకుల్ ప్రీత్ తీరు!

    |

    దక్షిణాదిలో రకుల్ ప్రీత్ సింగ్ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నది. హిట్టు, ఫ్లాప్ అనే సంబంధం లేకుండా క్రేజీ ఆఫర్లను సొంతం చేసుకొంటున్నది. తాజాగా టాలీవుడ్‌లో రకుల్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. నాగచైతన్యతో సినిమాను వదులుకొని నాగార్జునకు ఓటేయ్యడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే..

    నాగచైతన్యతో రకుల్ ప్రీత్

    నాగచైతన్యతో రకుల్ ప్రీత్

    మల్టీస్టారర్‌గా రూపొందుతున్న వెంకీ మామ చిత్రంలో వెంకటేష్, నాగచైతన్య హీరోలు అనే సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నాగచైతన్యతో రకుల్ ప్రీత్ సింగ్ జతకట్టాల్సింది. రారండోయ్ వేడుక చూద్దాం తర్వాత చైతూతో రెండోసారి జతకట్టడానికి రెడీ అయ్యింది. అంతలోనే నాగార్జునతో అవకాశం తలుపు తట్టడంతో ఆ సినిమా నుంచి తప్పుకొన్నది.

    నాగార్జున మన్మథుడు2 ఓటేసిన రకుల్

    నాగార్జున మన్మథుడు2 ఓటేసిన రకుల్

    ప్రస్తుతం నాగార్జున మన్మథుడు2 సినిమాతో రెడీ అవుతున్నాడు. ఈ చిత్రానికి రాహుల్ దర్శకుడు. దాంతో ఆఫర్ బాగుండటంతో రకుల్ ఈ చిత్రానికి పచ్చజెండా ఊపింది. కొడుకు చైతన్యతో కాకుండా తండ్రి నాగార్జునతో నటించడానికి రకుల్ ఇష్టపడటం సినీ వర్గాల్లో ఆసక్తి రేపింది. నాగార్జునతో రకుల్ నటించడం ఇదే తొలిసారి.

     వెంకీమామలో రకుల్ స్థానంలో నభ నటేష్

    వెంకీమామలో రకుల్ స్థానంలో నభ నటేష్

    వెంకీ మామ నుంచి రకుల్ తప్పుకోవడంతో ఆ అవకాశం నభ నటేష్‌కు అవకాశం దక్కింది. నన్ను దోచుకుందువటే చిత్రంతో నభ నటేష్ టాలీవుడ్‌కు పరిచయమైన సంగతి తెలిసిందే. ఇక వెంకీ మామలో శ్రీయా సరన్ వెంకటేష్ సరసన హీరోయిన్‌గా నటించే ఆఫర్‌ను దక్కించుకొన్నది. గతంలో ఈ పాత్ర కోసం పాయల్ రాజ్‌పుత్‌ను ఎంపిక చేసి ఆ తర్వాత ఆమెను తప్పించిన సంగతి తెలిసిందే.

     తండ్రి, కొడుకులతో ఒకేసారి అంటే

    తండ్రి, కొడుకులతో ఒకేసారి అంటే

    ఇదిలా ఉండగా, వెంకీ మామ, మన్మథుడు2 సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తున్నది. ఒకవేళ ఈ రెండు చిత్రాలను రకుల్ ప్రీత్ సింగ్ ఒప్పుకొంటే పరిస్థితి దారుణంగా ఉండేదనే మాట వినిపిస్తున్నది. ఒకే సమయంలో కొడుకు, తండ్రిగా రకుల్ కనిపిస్తే ప్రేక్షకులు జీర్ణించుకోవడం కష్టంగా ఉండేదంటున్నారు. రకుల్ వెంకీ మామ నుంచి తప్పుకోవడం మంచిదే అయిందంటున్నారు.

    English summary
    Actress Rakul Preet Singh rejected an offer to play the female lead opposite Naga Chaitanya in Venky Mama in a bid to work with the actor's father Akkineni Nagarjuna in Manmadhudu 2.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X