twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మూడు రోజులు పట్టింది.. ప్రెపేర్డ్‌గా వెళ్లినా సరే వేరే ట్రాన్స్‌లోకి తీసుకెళ్తాడు: రకుల్

    |

    Recommended Video

    Rakul Preet Singh About Director Selvaraghavan's Working Style || Filmibeat Telugu

    వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పంజాబీ భామ రకుల్ ప్రీత్ సింగ్ తన గ్లామర్ తో బాగా ఆకట్టుకుంటూ సౌత్ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. కెరీర్ ప్రారంభంలోనే స్టార్ హీరోలతో రొమాన్స్ చేసిన ఈ భామ.. నటన పరంగా కూడా మంచి మార్కులు కొట్టేసింది. మెల్లగా బాలీవుడ్ లో కూడా కాలు మోపి బీ టౌన్ ప్రేక్షకులకు తన అందాల రుచి చూపించిన ఈమె ప్రస్తుతం హీరో సూర్య సరసన ఎన్‌‌జికె చిత్రంలో నటిస్తోంది. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా మే 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్బంగా మీడియాతో ముచ్చటించిన రకుల్.. ఎన్‌‌జికె డైరెక్టర్ శ్రీ రాఘవ గురించిన పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.

    నటీనటులందరికీ అదే రూల్

    నటీనటులందరికీ అదే రూల్

    డైరెక్టర్ శ్రీ రాఘవతో పని చేసిన వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఎప్పుడూ కొత్తగానే అనిపిస్తుందని అంటోంది రకుల్. ఆయన షూట్ చేసే స్టైల్, చూపించే క్యారెక్టరైజేషన్స్‌ చాలా డిఫరెంట్‌ గా ఉంటాయని ఆమె చెబుతోంది. ''ఆయన సెట్లో క్లాప్‌ అనేదే ఉండకపోవడం ఆయనలోని ప్రత్యేకతకు నిదర్శనం. ఎంత పెద్ద డైలాగ్‌ చెబుతున్నా సరే ఐస్ బ్లింక్ చేయొద్దు. నటీనటులందరికీ ఈ రూలే పెడతారు శ్రీ రాఘవ'' అని చెప్పింది రకుల్.

    అర్ధం చేసుకోవడానికి మూడు రోజులు పట్టింది

    అర్ధం చేసుకోవడానికి మూడు రోజులు పట్టింది

    ఇక డైరెక్టర్ శ్రీ రాఘవ చెప్పిన కాన్సెప్ట్‌ అర్ధం చేసుకోవడానికి తనకు మూడు రోజులు పట్టిందని రకుల్ పేర్కొంది. ఇక ఆయన డైరెక్షన్ లో పని చేయాలంటే త్రీ సెకండ్స్‌ రూల్ కూడా పాటించాలి. అదేంటంటే.. యాక్షన్‌ చెప్పిన తరువాత త్రీ సెకండ్స్‌ ఆగి డైలాగ్‌ చెప్పాలి. ఒక రకంగా ఆయన దర్శకత్వంలో పనిచేయడమనేది ఒక యాక్టర్‌కి ఇవి న్యూ వేవ్‌ ఆఫ్ షూటింగ్‌ అనే చెప్పాలి అని రకుల్ పేర్కొంది.

    ఎంత ప్రిపేర్ అయినా వేరే ట్రాన్స్‌లోకి తీసుకెళ్తాడు

    ఎంత ప్రిపేర్ అయినా వేరే ట్రాన్స్‌లోకి తీసుకెళ్తాడు

    ఎన్‌‌జికె చిత్రంలో తన క్యారెక్టర్ కోసం ఎంతగా రీసెర్చ్ చేయలేదని చెప్పింది రకుల్. అయితే డైరెక్టర్ శ్రీ రాఘవ దగ్గరకు ఒకవేళ మనం ముందే ప్రెపేర్డ్‌గా వెళ్లినా సరే.. మనల్ని వేరే ట్రాన్స్‌లోకి తీసుకెళ్తాడాయన అని రకుల్ చెప్పుకొచ్చింది. అందుకే ప్రతీ రోజు ఏం ప్రిపేర్ కాకుండానే బ్లాంక్ గా షూటింగ్ కి వెళ్లేదాన్నని, ఆయన దర్శకత్వంలో పనిచేయడమే ఓ అదృష్టంగా భావిస్తున్నానని ఈ సందర్బంగా రకుల్ తెలిపింది.

    ఎన్‌‌జికె మూవీ

    ఎన్‌‌జికె మూవీ

    డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్త సమర్పణలో ఎన్‌‌జికె మూవీ తెరకెక్కింది. చిత్రానికి శ్రీరాఘవ దర్శకత్వం వహించగా.. సూర్య, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా నటించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాత, శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె.రాధామోహన్ ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. మే 31 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

    English summary
    Rakul Preet Singh spoke about Director Selvaraghavan shooting style. She played a heroine role in his NGK movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X