For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రకుల్ పొట్టలో గుద్ది పారిపోతూంటే, రాయి విసిరింది, అసలేం జరిగింది..పూర్తి డిటేల్స్

By Srikanya
|

హైదరాబాద్: హీరోలు, హీరోయిన్స్ కాకముందు అందరికీ చాలా సాధరణమైన జీవితమే ఉంటుంది. ఆ కామన్ లైఫ్ లో చాలా సంఘటనలు ఉంటాయి. కొన్ని ఆనందాన్ని కలిగించేవి అయితే ,మరికొన్ని మనలోని ధైర్యాన్ని తట్టి లేపేవి. అలాంటి ఓ అరుదైన సంఘటన రకుల్ ప్రీతి సింగ్ జీవితంలో జరిగిందిట.

ఇప్పుడంటే తన అందచందాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది కానీ... రకుల్‌ చిన్నప్పుడు టామ్‌బాయ్‌లా ఉండేదట. తన వయస్సున్న మగ పిల్లలతో కలిసి తిరిగేదట. అలాగని ఎవరైనా కుర్రాడు చనువుతీసుకుని కాలరెగరేసి, ఓవర్ చేసి, ఏడిపిస్తే అంతే సంగతులట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది రకుల్‌.

తనతో మిస్ బివేహ్ చేసినవారికి తన కరాటే స్కిల్స్ ని చూపించానని చెప్తూ తన గతం గుర్తు చేసుకుంది. రకుల్ మాట్లాడుతూ...' నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో ఫ్రెండ్స్‌తో కలిసి స్టడీ టూర్‌కి వెళ్లాను. రోడ్డు ప్రక్కన స్టాల్స్ లో స్వెట్టర్స్ కొంటూంటే ఒకడు మా ఫోటోలు తీస్తున్నాడు. వెళ్లి పోన్ లాక్కుని ఆ ఫొటోలు డిలేట్ చేసేసాం.

అంతేకాకుండా మా స్నేహితులను పోలీస్ లకు ఫోన్ చేయమని చెప్పాను. ఈ లోగా వాడు వాడు నా దగ్గర నుంచి ఫోన్ లాక్కున్నాడు. నేను వాడి కాలర్‌ పట్టుకుని గట్టిగా ఒకటి కొట్టాను. దాంతో వాడు నా కడుపు మీద గట్టిగా కొట్టేసి పారిపోయాడు. అయినా నేను వదల్లేదు. వెనకే పరుగెత్తి వాడిని రాయితో కొట్టా. ' అని రకుల్‌ చెప్పింది.

మరిన్ని సంఘటనలు ,ఎంబ్రాసింగ్ మూమెంట్స్ గురించి రకుల్ ఏం చెప్పిందో చదవండి

ఆపుకోలేకపోయా

ఆపుకోలేకపోయా

రకుల్ మాట్లాడుతూ... " నేను పిఫ్త్ స్టాండర్డ్ చదివేటప్పుడు, నేను బాత్ రూమ్ కు వెళ్లాలంటే కంట్రోలు చేసుకుని కాస్సేపు ఆగలేకపోయేదాన్ని. ఎందుకంటే నేను చిన్నప్పుడు ఎక్కువ మంచి నీళ్లు తాగుతూండేదాన్ని.

ఎగ్జామ్స్ జరిగేటప్పుడు

ఎగ్జామ్స్ జరిగేటప్పుడు

అయితే ఓ సారి ఎగ్జామ్ లో నేను బాత్ రూమ్ కు వెళ్లాలి అన్నాను. అయితే టీచర్ కుఅనుమానం వచ్చి ఎగ్జామ్ పూర్తయ్యాక వెళ్ళమంది.

కాపీ ఆలోచనలు

కాపీ ఆలోచనలు

అంత చిన్నవయస్సులో నాకు కాపీ ఆలోచనలు ఉంటాయా అని ఆలోచించలేదు. అప్పుడు టీచర్ నేను నాతో పాటు అనుమానం ఉంటే బాత్ రూంకు రమ్మనిమని అన్నాను. ఆమె ఒప్పుకోలేదు.

ఏడ్చేసా

ఏడ్చేసా

నేను మొత్తానికి నా పరీక్ష పూర్తి చేసుకుని, నా డస్క్ దగ్గరనుంచి పరుగెత్తుకు వెళ్లి, టీచర్ కు పేపర్ ఇచ్చేసి, తెగ ఏడ్చేసాను.

అదే ఎంబ్రాసింగ్ మూవ్ మెంట్

అదే ఎంబ్రాసింగ్ మూవ్ మెంట్

అప్పుడు నా వయస్సు ఓ ఆరు సంవత్సరాలు ఉంటుందంతే. అదే నా జీవితంలో చాలా ఎంబ్రాసింగ్ మూమెంట్ అంటూ చెప్పుకొచ్చింది.".

ఆశ్చర్యంతో అడుగుతారు

ఆశ్చర్యంతో అడుగుతారు

ఇప్పటికీ ఆమె చిననాటి మగ స్నేహితులు కలిస్తే..ఏంటి నువ్వు హీరోయిన్ వి అయ్యావా అని ఆశ్చర్యపోతూంటారు.

వాళ్లింకా నేను..

వాళ్లింకా నేను..

నేను ఇంకా అలాగే టామ్ బోయ్ లాగ ఉంటారనుకున్నారేమో అని ఆమె నవ్వేసింది.

ఇతర హీరోయిన్స్ తో పోలిక

ఇతర హీరోయిన్స్ తో పోలిక

ఇతర హీరోయిన్స్ తో మీరు ఎప్పుడైనా పోల్చుకుంటారా అంటే ..ఖచ్చితంగా ఎవరైనా పోల్చుకోను అని చెప్తే అబద్దమే

సీక్రెట్స్

సీక్రెట్స్

మీరు సీక్రెట్స్ ఎప్పుడైనా లీక్ చేసారా అంటే చేసాననే చెప్తా

మీ వయస్సు గురించి అబద్దం

మీ వయస్సు గురించి అబద్దం

మీరు మీ వయస్సు గురించి అబద్దం ఎప్పుడైనా చెప్పారా అంటే నో అంది

ఎ సర్టిఫికేట్

ఎ సర్టిఫికేట్

మీరు మీ పేరెంట్స్ కు తెలియకుండా ఎ సర్టిఫికేట్ సినిమా చూసారా అంటే చూసానని చెప్పింది.

మీ ఐడిని

మీ ఐడిని

మీరు పబ్ కు వెళ్లినప్పుడు ఐడిని చూపారా అంటే..చేసాను...బ్యాంకాక్ కు వెళ్లినప్పుడు అక్కడ పబ్ లో చూపెట్టాను

బంక్ కొట్టి

బంక్ కొట్టి

కాలేజి ఎగ్గొట్టి డేట్ కు ఎప్పుడైనా వెళ్లారా అంటే లేదని చెప్పిందామె

ఫెయిల్

ఫెయిల్

మీరు ఎప్పుడైనా ఎగ్జామ్స్ ఫెయిలయ్యారా అంటే లేదని చెప్పింది

ఫాలో చేసారా

ఫాలో చేసారా

మిమ్మల్ని ఎవరైనా సిన్సియర్ గా ఫాలో చేసారా అంటే..చేసారు..కానీ సారి చెప్పాను

 ఐడియల్ డేట్

ఐడియల్ డేట్

లాంగ్ డ్రైవ్ చేస్తూ లవ్లీ మ్యూజిక్ తో మంచి ఫుడ్ తో ఉండేదే ఐడియల్ డేట్ అని చెప్పింది

ముద్దు సీన్లతో

ముద్దు సీన్లతో

తెర మీద వచ్చే ముద్దు సీన్లతో మీ పేరెంట్స్ కు సమస్య లేదా అంటే వాళ్ల పర్మిషన్ ఎప్పుడూ తీసుకోలేదు అంది

నెగిటివ్ గా

నెగిటివ్ గా

నేను చాలా ప్రాక్టికల్‌గా, మరీ చెప్పాలంటే నెగెటివ్‌గా ఆలోచిస్తా. సినిమాల్లోకి వెళ్లాలని ఉన్నా, అక్కడ క్లిక్‌ అవకపోతే ఏంటీ పరిస్థితి అనీ ఆలోచించేదాన్ని.

ప్రమాదం జరిగితే

ప్రమాదం జరిగితే

ఏదైనా ప్రమాదం జరిగితే నా కాళ్ల మీద నేను నిలబడటానికి ఏం చేయాలా అనుకున్నా. అందుకే డిగ్రీలో మ్యాథ్స్‌ గ్రూప్‌ ఎంచుకున్నా. సినిమాల్లో రాణించలేకపోతే ఎంబీయే చేయాలన్నది నా ఆలోచన.

మోడలింగ్ ఏజన్సీ ద్వారా

మోడలింగ్ ఏజన్సీ ద్వారా

డిగ్రీ ఫస్టియర్‌లో ఉన్నప్పుడు మోడలింగ్‌ ఏజెన్సీ ద్వారా కన్నడలో ‘గిల్లీ' సినిమాలో హీరోయిన్‌గా అవకాశం వచ్చింది.

నెల చాలనున్నారు

నెల చాలనున్నారు

‘7జి బృందావన్‌ కాలనీ' సినిమాకు రీమేక్‌ అది. నెలరోజులు నటిస్తే సరిపోతుందని చెప్పారు. అప్పటికి నాకు దక్షిణాది సినిమాల గురించి ఏమాత్రం తెలీదు.

అదే రంగంలో

అదే రంగంలో

పాకెట్‌మనీకి బోలెడు డబ్బులొస్తాయి, సినిమా రంగంలో అనుభవం కూడా వస్తుందని ఒప్పుకున్నా. నెల రోజులు పనిచేశాక, డిగ్రీ పూర్తయ్యాక కూడా అదే రంగంలో కొనసాగాలని గట్టిగా నిర్ణయించుకున్నా.

పూరి ఫోన్ చేసారు

పూరి ఫోన్ చేసారు

ఆ సినిమా విడుదలయ్యాక నటిగా గుర్తింపుతో పాటూ అవకాశాలూ వచ్చాయి. మొట్టమొదట నాకు ఫోన్‌ చేసింది పూరీ జగన్నాథ్‌. ఓ సినిమాలో అవకాశం ఇవ్వడానికి పిలిచారు.

పూరీ కి నో చెప్పా

పూరీ కి నో చెప్పా

కాకపోతే శిక్షణ ఉంటుందనీ, ఓ వంద రోజులు డేట్లు కావాలని అడిగారు. అన్ని రోజులు కుదరదనీ డిగ్రీ పూర్తిచేయాలనీ చెప్పా.

నాన్నకు నచ్చ చెప్పారు కానీ..

నాన్నకు నచ్చ చెప్పారు కానీ..

‘డిగ్రీ మెడలో వేసుకుని తిరగం కదా, మంచి అవకాశాలు మళ్లీ రావు' అని ఆయన నాన్నకు నచ్చజెప్పారు. నాన్న కూడా నన్ను కరస్పాండెన్స్‌లో చదవుకోమని అన్నారు. నేను మాత్రం దానికి ఒప్పుకోలేదు.

అటెండెన్స్

అటెండెన్స్

‘గిల్లీ' సినిమా వల్ల ఫస్టియర్‌లో అటెండన్సు చాలా తగ్గింది. దాంతో సినిమా ఆలోచన కొన్నాళ్లు పక్కనపెట్టా.

కెరటంలో

కెరటంలో

ఈలోగా తెలుగులో మళ్లీ ‘కెరటం' అనే సినిమాలో హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. 60 రోజులు పడుతుందన్నారు.

ఆర్రోజులు

ఆర్రోజులు

అన్ని రోజులు కుదరదనీ, ఏదైనా వేరే పాత్ర ఉంటే ఇవ్వమనీ అడిగా. బహుశా హీరోయిన్‌ కావాలనుకునే వాళ్లెవరూ అలా అడగరు. నేను మాత్రం ఆ సినిమాలో ఓ చిన్న పాత్ర కోసం ఆర్రోజులు షూటింగ్‌లో పాల్గొన్నా. సా

అందుకే మిస్ ఇండియాలో

అందుకే మిస్ ఇండియాలో

ధారణ కుటుంబాలకు చెందిన వాళ్లు సినిమాల్లోకి రావాలంటే బ్యూటీ కాంటెస్టులే సరైన వేదికలు. నేను కూడా అదే ఉద్దేశంతో డిగ్రీ చివర్లో ఉన్నప్పుడు మిస్‌ ఇండియా పోటీల్లో పాల్గొన్నా.

మిస్సైనా

మిస్సైనా

ఒక్కోమెట్టూ ఎక్కుతూ ‘ఫైనల్‌ ఫైవ్‌' దశకు చేరుకున్నా. కానీ కొద్దిగా తేడాతో ‘మిస్‌ ఇండియా' కిరీటం మిస్సయింది. కానీ ఆ పోటీల్లో ‘మిస్‌ ఇండియా బ్యూటిఫుల్‌ స్మైల్‌, ఐస్‌, ఫేస్‌, టాలెంటెడ్‌' విభాగాలతో పాటూ ప్రేక్షకుల ఓట్ల ద్వారా ‘మిస్‌ ఇండియా పీపుల్స్‌ ఛాయిస్‌' అవార్డునూ అందుకున్నా.

స్టడీ చేస్తే తెలిసింది

స్టడీ చేస్తే తెలిసింది

ఆ తరవాతే ప్రకటనలతో పాటూ నెమ్మదిగా సినిమాల్లో అవకాశాలు రావడం మొదలయ్యాయి. నాకొచ్చిన ఆఫర్ల గురించి స్టడీ చేశా. పూరీ జగన్నాథ్‌ ఎంత పెద్ద దర్శకుడో, ఆయన సినిమాను వదిలేసి ఎంత తప్పు చేశానో అప్పుడే అర్థమైంది.

అలిసిపోను

అలిసిపోను

సినిమాల్లో నిద్రా, సమయంతో పనిలేదు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు, ఎంత సేపంటే అంత సేపు పనిచేయాలి. కానీ నేను త్వరగా అలసిపోను. ఈ విషయంలో నా స్పోర్ట్స్‌, నాన్న నేర్పిన క్రమశిక్షణ చాలా ఉపయోగపడుతున్నాయి.

బ్రేక్ ఇవ్వను

బ్రేక్ ఇవ్వను

ఎంత బిజీగా ఉన్నా జిమ్‌కు బ్రేక్‌ ఇవ్వను. వారంలో ఓ మూడ్రోజులు యోగా చేస్తా. వారానికోసారి గోల్ఫ్‌ ఆడతా.

సర్దుకుపోయే తత్వం

సర్దుకుపోయే తత్వం

చిన్నప్పట్నుంచీ చాలా రాష్ట్రాల్లో పెరగడం వల్ల అందరితో సర్దుకుపోయే తత్వం పెరిగింది. సినీ రంగంలో అది చాలా అవసరం.

పదిభాషల మీద గ్రిప్

పదిభాషల మీద గ్రిప్

తెలుగు చాలా బాగా మాట్లాడతా. సుమారు పది భాషలు అర్థమవుతాయి.

క్లిక్ కాకపోతే

క్లిక్ కాకపోతే

హీరోయిన్‌గా రాణించకపోతే ఏం చేయాలని ముందే నిర్ణయించుకున్నా. ఎంబీయే ‘బ్రాండ్‌ మేనేజ్‌మెంట్‌' చేసి ఆ రంగంలో స్థిరపడేదాన్ని.

ఆట పట్టిస్తా

ఆట పట్టిస్తా

గాడ్జెట్స్‌ పైన మరీ అంత ఆసక్తి లేదు. కాకపోతే మాటిమాటికీ ఫోన్‌ చూసుకునే అలవాటుంది. తోటి నటులు ఆ విషయంలో నన్ను ఆటపట్టిస్తారు.

నిముషం పాత్రైనా

నిముషం పాత్రైనా

అమితాబ్‌ నాకు ఇష్టమైన నటుడు. ఆయన పక్కన కూతురిగా ఒక్క నిమిషం నటించే పాత్ర వచ్చినా చేస్తా.

అదృష్టం ఉండాలి

అదృష్టం ఉండాలి

సినిమాల్లో తొలి అవకాశం రావాలంటే అదృష్టం ఉండాలి. నేను అనుకున్నట్లు ‘మిస్‌ ఇండియా' పోటీల తరవాత అవకాశాలు వాలిపోలేదు. చాలా నెమ్మదిగా కెరీర్‌ మొదలైంది.

రెండూ సక్సెస్

రెండూ సక్సెస్

మొదట తమిళంలో ‘పుత్తగన్‌' అనే సినిమా చేశా. ఆ తరవాత హిందీలో ‘యారియా' చేశా. ఆ రెండూ విజయం సాధించాయి.

తెలుగులో..

తెలుగులో..

తరవాత తెలుగులో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌'లో అవకాశం వచ్చింది. నిజానికి మొదట ఒప్పుకున్న సినిమా ‘రఫ్‌'.

లేటైంది

లేటైంది

రఫ్ చిత్రం ముప్ఫయి రోజులు షూటింగ్‌ జరిగాక అది వాయిదా పడుతూ వచ్చింది. ఈలోగా ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌' విడుదలై హిట్టయింది. ఆ తరవాత గోపీచంద్‌తో చేసిన ‘లౌక్యం', మనోజ్‌తో ‘కరెంట్‌ తీగ' కూడా విజయాన్ని అందుకున్నాయి.

వరసపెట్టా

వరసపెట్టా

ఓవైపు తమిళం నుంచి ఆఫర్లు మొదలయ్యాయి. ప్రస్తుతం రామ్‌తో ‘పండగ చేస్కో', రవితేజతో ‘కిక్‌ 2' విడుదల అయ్యాయి. బాలీవుడ్‌లో ‘సిమ్లా మిర్చి' కూడా చేసా. ‘జూ.ఎన్టీఆర్‌-సుకుమార్‌', ‘రామ్‌చరణ్‌-శ్రీనువైట్ల' సినిమాలు కూడా చేసా.

కెప్టెన్ గా..

కెప్టెన్ గా..

పన్నెండో తరగతిలో నేను స్కూల్‌ స్పోర్ట్స్‌ కెప్టెన్‌గా ఉండేదాన్ని. ఓసారి క్లాస్‌ జరుగుతున్నప్పుడు కిటికీలో నుంచి బ్యాగ్‌ను బయటకు విసిరేసి దూకేశా. అప్పుడే ఎదురుగా మా క్లాస్‌ టీచర్‌ వచ్చింది. విషయం తెలిసి ప్రిన్సిపల్‌ నన్ను పదిహేను రోజుల పాటు స్పోర్ట్స్‌ కెప్టెన్‌గా సస్పెండ్‌ చేశారు.

సారీ చెప్పా

సారీ చెప్పా

నా టై, బ్యాడ్జీ తీసేసుకున్నారు. ఇంట్లో విషయం తెలియకూడదని నేను ఫ్రెండ్‌ టై, బ్యాడ్జ్‌ తీసుకొని వెళ్లేదాన్ని. మూడు రోజుల తరవాత తమ్ముడి గురించి మాట్లాడటానికి అమ్మ స్కూలుకొచ్చింది. అప్పుడే ప్రిన్సిపల్‌ నా గురించి చెప్పారు. ఇంటికొచ్చాక నా టై ఎక్కడని అమ్మ అడిగింది. విషయం అర్థమైందని తెలిసి సారీ చెప్పా.

మానేసా

మానేసా

‘నీకు స్కూల్‌కి వెళ్లాలని లేకపోతే ఇంట్లోనే ఉండూ, కానీ బయటి వాళ్లతో ఇలా చెప్పించకు' అన్నారు. అప్పట్నుంచీ అలాంటి పనులు మానేశా.

మోడలింగ్ లోకి

మోడలింగ్ లోకి

పన్నెండో తరగతిలో ఉన్నప్పుడే పోర్ట్‌ఫోలియో తయారు చేయించుకుని మోడలింగ్‌లోకి అడుగుపెట్టా.

చిన్నప్పటినుంచే

చిన్నప్పటినుంచే

నాకు చిన్నప్పట్నుంచీ ఫొటోలు దిగడం చాలా ఇష్టం. ఇంట్లో ఎప్పుడూ నా ఒక్కదాని ఫొటోలే తీయమని గొడవ చేసేదాన్ని. అమ్మ కూడా, ‘పెద్దయ్యాక మోడల్‌ అవుదువులే, ఇప్పుడు చదువుకో' అని చెప్పేది.

ఏడ్చేసా

ఏడ్చేసా

నేను నాలుగో తరగతికి వచ్చేవరకూ నాకు ఏ స్నేహితుల మొహం గుర్తులేదు. నాలుగో తరగతి చదివేప్పుడు జలంధర్‌లో ఉన్నాం. అక్కడ ఒకమ్మాయి నాకు బెస్ట్‌ ఫ్రెండ్‌ అయింది. కానీ షరా మామూలుగా నాన్నకు బదిలీ అయింది. నేను అక్కడే ఉండి చదువుకుంటానని బాగా ఏడ్చా.

నచ్చచెప్పారు

నచ్చచెప్పారు

‘మనం ఇప్పుడు నాసిక్‌ వెళ్తున్నాం. అక్కడ ప్యారా సెయిలింగ్‌, స్కై జంపింగ్‌ లాంటి బోలెడు ఆటలుంటాయి. ఇండియాలో ఇంకెక్కడా అవి ఉండవు' అని నచ్చ జెప్పడంతో అక్కడికెళ్లడానికి ఒప్పుకున్నా. అలా తొమ్మిదో తరగతికి వచ్చేసరికి పది స్కూళ్లు మారా.

English summary
"YES I have beaten up a guy when we have gone for a girl's trip during our college days. He was taking our pictures when we are trying sweaters in a roadside stalls.He then punched me in my stomach and ran away. I followed him picked up a stone and hit him" Said Rakul Preet singh.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more