తల్లితో కలిసి రకుల్ ప్రీతి సింగ్ ఇలా...(ఫొటో)
హైదరాబాద్ : వరస ఆఫర్స్ తో దూసుకుపోతున్న రకుల్ ప్రీతి సింగ్...ప్రస్తుతం కిక్ 2 చిత్రం షూటింగ్ నిమిత్తం హంపీ వెళ్లటం జరిగింది. ఆమెతో పాటు తల్లి కూడా వచ్చింది. ఇద్దరూ షూటింగ్ గ్యాప్ లో లొకేషన్ లో ఇలా ముచ్చట్లు చెప్పుకుంటూ సెల్ఫీ దిగారు. తన తల్లితో తనకు మంచి అనుబంధం ఉందని, తల్లి తను కూతురు లా కాకుండా ఓ స్నేహితురాలిలా ఉంటానని చెప్పుకొచ్చింది. మీరూ ఆ ఫొటోపై ఓ లుక్కేయండి.
ఇక ఆమె కెరీర్ విషయానికి వస్తే...

వెంకటాద్రి ఎక్సప్రెస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె ఇప్పుడు రామ్ సరసన పండుగ చేస్కో, రవితేజ సరసన కిక్ 2 చిత్రాలు చేస్తోంది. ఈ రెండు భారీ బడ్జెట్ చిత్రాలు కావటం విశేషం. అలాగే ఈమె ఇప్పుడు సుకుమార్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రం సైన్ చేసిందని తెలుస్తోంది. దాంతో ఆమెకు పెద్ద హీరోలు నుంచి ఆఫర్స్ వస్తున్నాయి. దానికి తగినట్లే ఆమె రెమ్యునేషన్ ని పెంచేసుకుంటూ వెళ్తోంది.
ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ హైదరాబాద్ టు ముంబై, ముంబై టు సిమ్లా, సిమ్లా టు హైదరాబాద్ ఇలా బిజీగా తిరుగుతుంది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ఇచ్చిన కిక్‌తో ఈ అమ్మడు వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. అరడజను సినిమాలతో తిరిక లేకుండా గడుపుతోంది. మరోవైపు హిందీ సినిమా హడావుడిలో ఉంది. అందుకోసం హైదరాబాద్ నుంచి ముంబై, ముంబై నుంచి హైదరాబాద్ పదే పదే తిరిగాల్సి వస్తోంది. మధ్యలో సిమ్లాలో హిందీ సినిమా చిత్రీకరణలో పాల్గొంటుంది. దీంతో రకుల్ ఇప్పుడు యమ బిజీ బ్యూటీ అయిపోయింది.
''రోజూ చిత్రీకరణ ముగిసి ఇంటికి వెళ్తున్నప్పుడు నాకు నేనే ఓ ప్రశ్న వేసుకొంటున్నా. ''ఈ రోజు ఇక్కడ నేనేం నేర్చుకొన్నా..' అని. ప్రతిసారి సంతృప్తికరమైన సమాధానం దొరుకుతోంది. అందుకే మరుసటి రోజు మరింత ఉత్సాహంగా సెట్‌లోకి అడుగుపెడుతున్నా..'' అంటోంది రకుల్ ప్రీత్‌సింగ్.

''స్కూల్‌కి ఎంత హుషారుగా వెళ్లేదాన్నో... సెట్స్‌కీ అలానే వెళ్తున్నా. చుట్టూ నా మనుషులే ఉన్నట్లుంది. రోజూ చిత్రీకరణ ఉంటే బాగుంటుందనిపిస్తోంది. నేను సినిమాలకు కొత్త. అందుకే ప్రతిదీ నాకు వింతగా అనిపిస్తోంది. ఇవన్నీ ఎంత త్వరగా నేర్చుకుంటానా అనే ఆత్రుత ఉంది. ప్రస్తుతానికి నేర్చుకొనే దశలో ఉన్నాను. ఒకట్రెండు తప్పులు చేసినా సెట్లో దర్శకులు పెద్ద మనసుతో క్షమించేస్తున్నారు'' అని చెబుతోంది రకుల్.
‘కిక్'-2 విషయానికి వస్తే... వరస విజయాలతో దూసుకుపోతున్న భామ రకుల్ ప్రీతి సింగ్. ఆమె ప్రస్తుతం రవితేజ హీరోగా రూపొందుతున్న ‘కిక్'-2 లో హీరోయిన్ గా చేస్తోంది. అందులో తాను పల్లెటూరి అమ్మాయిగానూ, సిటీ గర్ల్ గానూ కనిపింస్తానని రీసెంట్ గా ట్వీట్ చేసింది. దాంతో ఆమె ద్విపాత్రాభినయం చేస్తోందంటూ మీడియాలో ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆమె దాన్ని ఖండిస్తూ మళ్లీ ట్వీట్ చేసింది.
రకుల్ ట్వీట్ చేస్తూ... 'నేను కిక్ 2 లో పల్లె, సిటీ అమ్మాయిగా చేస్తున్న మాట నిజమే. అయితే నేను రెండు అవతరాల్లో కనిపిస్తాను అని చెప్తున్నాను కానీ, ద్వి పాత్రాభినయం చేయటం లేదు.మీరు థియోటర్ లో ఆ పాత్రను చూసినప్పుడు ఆశ్చర్యపోతారు ', అంటూ ట్విస్ట్ తో కూడిన ట్వీట్ చేసింది. ఇదంతా చిత్రం ప్రచారం కోసమే అంటున్నారు సినీ వాసులు.

రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘కిక్' చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఇపుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా రవితేజ హీరోగా నటించే ఈ చిత్రాన్ని నందమూరి తారకరామారావు ఆర్ట్స్ పతాకంపై హీరో కళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్న ‘కిక్-2' చిత్రానికి దర్శకత్వం సురేందర్ రెడ్డి. ఈ చిత్రం ఇటీవల హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభమై రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఆద్యంతం వినోద ప్రధానంగా సాగే చిత్రమని రవితేజ అన్నారు.
'కిక్'లో జంటగా నటించిన రవితేజ, ఇలియానా పాత్రల కొడుకు కథే ఈ 'కిక్ 2' అని దర్శకుడు తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ...యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో రవితేజ మార్క్ ఎంటర్‌టైనర్‌తోపాటు సురేందర్ రెడ్డి, తమన్నా మ్యాజిక్ మళ్లీ రిపీట్ కానుంది. ఈ చిత్రం మే 28, 2015న విడుదల చేస్తామన్నారు. ఈ చిత్రానికి కథ:వక్కంతం వంశి, కెమెరా:మనోజ్ పరమహంస, సంగీతం:తమన్, నిర్మాత:నందమూరి కళ్యాణ్‌రామ్, దర్శకత్వం:సురేందర్ రెడ్డి.


Click it and Unblock the Notifications











