రకుల్‌కు కరోనా.. ఆట పట్టించిన మంచు లక్ష్మీ.. ట్వీట్స్ వైరల్
కరోనా వైరస్ వ్యాప్తి తగ్గలేదు. కరోనాకు వ్యాక్సిన్ ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు. పైగా ఈ కరోనానే పోలేదు అంటూ మరో కొత్త రకమైన వైరస్ వ్యాప్తి చెందుతోందట. అలా కరోనా ఎంతగా విజృంభిస్తోన్న, కొత్త వైరస్‌లు వస్తున్నా కూడా జనాల్లో మాత్రం భయం ఉండటం లేదు. ఎంతో జాగ్రత్తగా ఉండే సెలెబ్రిటీలకు కూడా కరోనా సోకుతోంది. తాజాగా రకుల్ ప్రీత్‌కు కరోనా సోకిందట. ఈ విషయాన్ని రకుల్ తాజాగా సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

కరోనా వైరస్..
సినీ ఇండస్ట్రీ, సెలెబ్రిటీలను కరోనా వదలడం లేదు. సినిమా షూటింగ్‌లంటూ ఇప్పుడిప్పుడే బిజీ అవుతుండగా ఇలా కొందరు కరోనా బారిన పడుతున్నారు. గత వారంలో శరత్ కుమార్ కూడా కరోనా బారిన పడ్డాడు. ఇప్పుడు ఆయన కోలుకున్నాడు. తాజాగా రకుల్ కూడా కరోనా బారిన పడింది.

అందరూ పరీక్షలు..
కరోనా పరీక్షల్లో నాకు పాజిటివ్ వచ్చిందనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. స్వయంగా నాకు నేనుగా క్వారంటైన్‌లోకి వెళ్లాను. నాకు ఇప్పుడు బాగానే ఉంది.. ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నాను.. మళ్లీ త్వరలోనే షూటింగ్ సెట్‌లోకి అడుగుపెడతాను.. నన్ను కలిసిన ప్రతీ ఒక్కరూ పరీక్షలు చేసుకోండి.. మీరంతా జాగ్రత్తగా ఉండండి అని రకుల్ చెప్పుకొచ్చింది.

నెగెటివ్ పర్సన్..
తనకు కరోనా వచ్చిందని రకుల్ చేసిన పోస్ట్‌కు మంచు లక్ష్మీ ఫన్నీ కామెంట్ పెట్టింది. నేను కూడా టెస్ట్ చేయించుకున్నాను కానీ నాకు నెగెటివ్ వచ్చింది.. ఈ ఏడాది మొత్తంలో మోస్ట్ నెగెటివ్ పర్సన్‌ని నేనే అంటూ మంచు లక్ష్మీ కౌంటర్ వేసింది. దీనికి రకుల్ హహహ అని నవ్వేసింది. ఇప్పుడే కాదు ఎప్పటికీ నెగెటివ్‌గానే ఉండాలని కోరుకుంటున్నాని రకుల్ చెప్పుకొచ్చింది.

మేడే షూటింగ్..
అయితే రకుల్ ప్రస్తుతం అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగణ్ కాంబోలో వస్తోన్న మేడే సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది. అంటే రకుల్‌కు కరోనా అంటే ఇప్పుడు ఆ టీం మొత్తం చిక్కుల్లో పడ్డట్టే కనిపిస్తోంది. మరి రకుల్‌కు కరోనా రావడంతో ఈ మూవీ షూటింగ్ ఏమైనా వాయిదా పడుతుందేమో చూడాలి.


Click it and Unblock the Notifications











