twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మీకు అలాంటి పరిస్థితి రావొద్దు.. వాటిని పూసగుచ్చినట్టు వివరించిన రకుల్

    |

    ఇప్పుడంటే జనాలకు కరోనా మీద భయం పోయింది. పైగా వ్యాక్సిన్ కూడా వచ్చేసింది. కానీ ఐదారు నెలల క్రితం కరోనా అంటే తెగ భయపడేపోయేవారు. పాజిటివ్ వచ్చిందంటే చాలు ఏదో పాపం చేసినట్టుగా చూసేవారు. అలా కరోనా వైరస్ జనాలను భయపెట్టేసింది. కానీ ఇప్పుడు కరోనా అంటే లైట్ తీసుకుంటున్నారు. కరోనాను జయించడం అంత పెద్ద కష్టమేమీ కాదు. అదే విషయాన్ని రకుల్ ఇప్పుడు చెప్పుకొచ్చింది.

    Recommended Video

    Rakul Preet Singh Supports Her Brother's Debut ' Tera Venuka'
    కరోనా పాజిటివ్..

    కరోనా పాజిటివ్..


    రకుల్ ప్రీత్ సింగ్‌కు కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. మేడే సినిమా షూటింగ్ సెట్‌లోకి అడుగుపెట్టిన తరువాత రకుల్‌కు పాజిటివ్ అని సోకింది. అలా పాజిటివ్ వచ్చిన వెంటనే రకుల్ క్వారంటైన్‌కే పరిమితమైంది. క్వారంటైన్‌లో సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంది.

    వయ్యారాల సోయగం.. మనీషా అందాల ఆరబోత

    నెగెటివ్ వచ్చాక..

    నెగెటివ్ వచ్చాక..


    రకుల్ క్వారంటైన్ ముగించుకుని నెగెటివ్ రిపోర్ట్ వచ్చాక వెంటనే సినిమా షూటింగ్‌లో పాల్గొంది. వరుసగా సినిమాలతో బిజీగా ఉన్న రకుల్ ఎక్కువగా విశ్రాంతి తీసుకోలేకపోయింది. మేడే, అలయాన్ వంటి సినిమాలతో బిజీగా ఉంది. ఈ లోపే మరికొన్ని సినిమాలను ఓకే చేసింది.

    పాటించిన నియమాలివే..

    పాటించిన నియమాలివే..

    తాను క్వారంటైన్‌లో చేసిన పనులు, పాటించిన నియమాలనుచెబుతూ రకుల్ ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో యోగాసానాలు, ఆవిరి పీల్చడం, పసుపు నీళ్లు తాగడం, బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ వంటి చేశానని చూపించింది. రోజంతా ఇదే పని అని చెప్పుకొచ్చింది. ఆ తరువాత డాక్టర్లు సూచించినట్టుగా మందులు, విటమిన్ల ట్యాబెట్లు వేసుకోవాలని తెలిపింది.

    మీకు ఆ పరిస్థితి రావొద్దు..

    మీకు ఆ పరిస్థితి రావొద్దు..

    కరోనాను ఎలా జయించాను.. క్వారంటైన్‌లో ఏం చేశానో మీ అందరికీ చెప్పాను.. ఇది మీలో ఎవ్వరికైనా ఉపయోగపడొచ్చు.. కానీ అలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు.. ఎవ్వరూ కరోనా బారిన పడకూడదని రకుల్ చెప్పుకొచ్చింది. కరోనా నెగెటివ్ వచ్చాక కూడా విశ్రాంతి తీసుకోవాలి.. సరైన ఆహారం తీసుకోవాలి.. వ్యాయామం చేయాలని సూచించింది.

    English summary
    Rakul preet Video On quarantine Diaries Covid precautions,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X