ఆ విషయం పవన్ కళ్యాణ్‌ని అడగండి నన్ను కాదు: రకుల్‌ప్రీత్ సింగ్

Recommended Video

ఆ విషయం పవన్ కళ్యాణ్‌ని అడగండి ! నన్ను కాదు

ఇప్పుడు ఓ తమిళ్ డబ్బింగ్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వస్తోంది రకుల్. కార్తీ హీరోగా నటించిన మూవీ కావడంతో.. తెలుగులో కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఈ శుక్రవారం ఖాకీ రిలీజ్ సందర్భంగా.. అటు తమిళ్ తో పాటు ఇటు తెలుగు వెర్షన్ కూ తెగ ప్రమోషన్స్ చేస్తోంది.

 సంతోష్ శ్రీనివాస్

సంతోష్ శ్రీనివాస్

ప్రస్తుతం త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్న పవన్ కళ్యాణ్ తర్వాత రెండు సినిమాల్ని చేయాల్సి ఉంది. వాటిలో ఒకటి ఆర్టీ నీసన్ తో కాగా మరొకటి సంతోష్ శ్రీనివాస్ ప్రాజెక్ట్. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేసిన సంతోష్ శ్రీనివాస్ పవన్ సరసన హీరోయిన్ ను వెతికే పనిలో ఉన్నారట. సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం రకుల్ ప్రీత్ సింగ్ ను ప్రాజెక్టులోకి తీసుకునే యోచనలో ఉన్నారని టాక్ వచ్చింది.

ఆశలు వదిలేసుకున్నట్టే ఉంది

ఆశలు వదిలేసుకున్నట్టే ఉంది

మరి పవన్ కళ్యాణ్ సరసన నటించాలని ఉందని గతంలో పలుసార్లు తన మనసులోని మాటను వ్యక్తపరచిన రకుల్ కోరిక నెరవేరుతుందనే అంతా అనుకున్నా తర్వాత మాత్రం అసలు ఆ ఊసే వినిపించటం లేదు, అసలు ఆ విషయంలో కనీస క్లారిటీ కూడా లేదు. రకుల్ కూడా ఇక ఆ ఆఫర్ మీద ఆశలు వదిలేసుకున్నట్టే ఉంది.

డిఫరెంట్ ఆన్సర్ ఇచ్చింది

డిఫరెంట్ ఆన్సర్ ఇచ్చింది

అయితే ఈ మధ్యనే పవన్ కళ్యాణ్‌తో సినిమా ఎప్పుడు అనే ప్రశ్న ఎదురైంది. సహజంగా ఇలాంటి క్వశ్చన్స్ కు.. త్వరలోనే అనో.. నేనూ ఎదురుచూస్తున్నా అనో ఆన్సర్ వస్తుంది. కానీ రకుల్ మాత్రం డిఫరెంట్ ఆన్సర్ ఇచ్చింది. అదికూడా కర్ర విరక్కుండా పాము చావకుండా అన్నట్టు అడిగిన వాళ్ళకే భాధ్యత అప్పజెప్పేసింది .

ఓ పని చేయండి

ఓ పని చేయండి

"నాకూ చేయాలనే ఉంది. ఓ పని చేయండి. మీరే వెళ్లి ఇదే ప్రశ్న పవన్ కళ్యాణ్ గారినే అడగండి"అనేసింది రకుల్ ప్రీత్ సింగ్. కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఓకే కానీ.. మరీ ఈమె గురించి అడిగితే.. పవన్ ని ఆన్సర్ అఢగమని చెప్పడం మాత్రం టూమచ్ అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X