నటుడు జీవితాంతం విద్యార్థిలా ఉండాలి: రాళ్ళపల్లి
Recommended Video

విద్యార్థిలా నిత్యం నేర్చుకోవాలి !
మా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ హైదరాబాద్‌లోని ఎఫ్ఎన్‌సిసి క్లబ్‌లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ, టెలివిజన్, మీడియా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు రాళ్ళపల్లి, సినీ క్రిటిక్ గుడిపూడి శ్రీహరి, బిగ్ బాస్ విజేత శివ బాలాజీలను ఆత్మీయంగా సన్మానించారు.
ఈ సందర్బంగా నటుడు రాళ్ళపల్లి మాట్లాడుతూ.. మా మమల్మి సత్కరించడం చాలా సంతోషంగా ఉంది. నటుడు జీవితాంతం విద్యార్థిలా నిత్యం నేర్చుకోవాలి. బతికి ఉన్నన్ని రోజులు 'మా' సంస్థ కోసం చేతనైన సహాయం చేస్తాను అని అన్నారు. సిని క్రిటిక్ గుడిపూడి శ్రీహరి మాట్లాడుతూ.. మా మమల్మి సత్కరించడం చాలా ఆనందంగా ఉంది. నా కెరీర్‌లో దాదాపు 5000 చిత్రాలకుపైగా సినిమా రివ్యూలు రాశాను. ఇప్పుడు చూస్తున్న నటీనటులందరు కొత్త వాళ్ళు. వారి చేతుల మీదుగా సన్మానం జరుగడం ఆనందంగా ఉంది అని అన్నారు.


Click it and Unblock the Notifications











