కొన్నాళ్లు రహస్యంగా ఉంచుతాం: హీరో రామ్
'కందిరీగ'కి సీక్వెలా? కాదా? అనే విషయం ఇప్పుడు చెప్పం. ఆ విషయాన్ని కొన్నాళ్లు రహస్యంగా ఉంచుతాం. 'కందిరీగ' అందరికీ నచ్చింది. ఆ చిత్రదర్శకుడు సంతోష్ శ్రీన్‌వాస్‌తో చేయబోతున్న ఈ రెండో చిత్రం మరింత ఆనందాన్నిస్తుంది. 'కందిరీగ'కన్నా డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్, డబుల్ యాక్షన్.. ఇలా అన్నీ డబుల్‌గా ఉంటాయి అన్నారు రామ్. రామ్,సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మరో చిత్రం ప్రారంభమైన సందర్భంలో రామ్ ఇలా స్పందించారు.
రామ్, హన్సిక జంటగా నటించిన సినిమా 'కందిరీగ'. సంతోష్ శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయమయ్యారు. బెల్లంకొండ సురేష్ నిర్మించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. తిరిగి వీరి కాంబినేషన్‌లో మరో చిత్రం ప్రారంభమైంది. హీరోయిన్ ఎంపిక చేయాల్సి ఉంది. రామానాయుడు స్టూడియోలో లాంఛనంగా షూటింగ్ ప్రారంభమైంది. రామ్‌పై తొలి సన్నివేశాన్ని చిత్రీకరించారు. దీనికి స్రవంతి రవికిషోర్ క్లాప్ కొట్టగా, బి.గోపాల్ కెమెరా స్విచ్చాన్ చేశారు. వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. అలాగే దర్శకుడు మాట్లాడుతూ...'కందిరీగ కంటే డబుల్ యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటుంది. స్క్రిప్ట్ అంతా చాలా బాగా వచ్చింది. కందిరీగ సీక్వెల్ అనేది అవునా ? కాదా ? అనేది చూసి చెప్పాలి' అని అన్నారు.
నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ...'మే నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. కందిరీగ కంటే స్క్రిప్ట్ బాగా వచ్చింది. యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్, సెంటిమెంట్‌కు మంచి స్కోప్ ఉన్న సినిమాగా పేరు వస్తుంది. హీరోయిన్ పేరు త్వరలో వెల్లడిస్తాం' అని అన్నారు.
సాయిగణేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై, మల్టీ డైమన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో రూపొందనున్న ఈ చిత్రంలో సోనూసూద్, బ్రహ్మానందం, ధర్మవరపు, రఘుబాబు, సాయాజీ షిండే, ఎమ్మెస్ నారాయణ తదితరులు నటిస్తున్నారు. సంగీతం: తమన్, ఛాయాగ్రహణం: వెట్రి, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, కళ: ఎ.ఎస్.ప్రకాష్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: సంతోష్ శ్రీనివాస్, సమర్పణ: మల్టీడైమెన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్స్.


Click it and Unblock the Notifications











