'కందిరీగ' దర్శకుడు నెక్స్ట్ ఈ రోజే ప్రారంభం
రామ్ తో కందీరీగ వంటి కామెడీ ఎంటర్టైనర్ తీసి సూపర్ హిట్ ఇచ్చిన సంతోష్ శ్రీనివాస్ తదుపరి చిత్రం ఈ రోజే (ఏప్రియల్ 12, 2012)న ప్రారంభం కానుంది. హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఈ చిత్రం ముహూర్తం జరుపుకోనుంది. అలాగే ఈ చిత్రంలోనూ రామ్ హీరోగా చేస్తున్నాడు. అలాగే బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అప్పట్లో బెల్లంకొండ సురేష్ ..రామ్ ల మధ్య రెమ్యునేషన్ విషయంలో వివాదాలు ఫిల్మ్ ఛాంబర్ వరకూ ఎక్కాయి. అయితే అవన్నీ మరిచి మళ్లీ టీమ్ గా ఏర్పడి సినిమా చేస్తున్నారు.
ఇక ఈ చిత్రం కందిరీగ కు సీక్వెల్ అని వినిపించింది. అయితే అదేమీ కాదని రామ్ చెప్తున్నారు. బెల్లంకొండ సురేష్ కి దర్శకుడు రెండో సినిమా చేస్తానని రాసిన ఎగ్రిమెంట్ ప్రకారం ఈ చిత్రం చేస్తున్నాడని తెలుస్తోంది. అలాగే రామ్ కి సైతం బెల్లంకొండ వద్ద కమిట్మెంట్ ఉండటంతో కొన్ని కండీషన్స్ పెట్టి ఈ చిత్రం చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇక ఈ చిత్రం కూడా కందిరీగ మాదిరిగానే ఫన్ తో కూడిన యాక్షన్ చిత్రం అని చెప్తున్నారు. రామ్ తన దైన శైలిలో నవ్విస్తూ ఈ చిత్రాన్ని ముందుకు తీసుకెళ్ళతాడని,కందీరీగ మాదిరిగానే ఈ చిత్రం కూడా మంచి విజయం సాధిస్తుందని చెప్తున్నారు.
ఇక ప్రస్తుతం రామ్ నటించిన ఎందుకంటే ప్రేమంట చిత్రం మే 11 న విడుదలకు సిద్దమైంది. తమన్నా కాంబినేషన్ లో కరుణాకరన్ రూపొందించిన ఈ చిత్రం ఓ ప్రేమ కథ. రెగ్యులర్ కరుణాకరన్ చిత్రాల తరహాలోనే ఈ చిత్రాన్ని పూర్తిగా మంచి విజువల్స్ తో చక్కని ప్రేమ కథా చిత్రంగా మలిచాడని,రామ్ కెరీర్ లో చెప్పుకోదగ్గ చిత్రం అవుతుందని చెప్తున్నారు. ఇక రామ్ సైతం ఈ చిత్రంపై చాలా నమ్మకం పెట్టుకున్నారు. రామ్-తమన్నా జంటగా స్రవంతి మూ వీస్ పతాకంపై కృష్ణ చైతన్య సమర్పణలో రూపొందిన చిత్రం 'ఎందుకంటే... ప్రేమం ట!'. కరుణాకరన్ ఈ చిత్రానికి దర్శకుడు. స్రవంతి రవికిశోర్ నిర్మాత. కోన వెంకట్ మాటలు అందిస్తున్నారు.
ఈ సినిమా గురించి రామ్ మాట్లాడుతూ 'ఓ మంచి కాంబిషన్‌తో సినిమా చేయడం సంతోషాన్నిస్తోంది. 'కందిరీగ' కెమెరామెన్ ఆండ్రూ ఈ సినిమాకి కూడా పనిచేస్తున్నారు. రెడీ'లో అతిధి పాత్రలో నటించిన తమన్నా ఈ సినిమాలో పూర్తిస్థాయి నాయికగా నటిస్తుం డడం సంతోషంగా ఉంది' అన్నారు. 'కరుణాకరన్ సినిమాలు అందమైన పుష్పాలు. వాటిలో నటించడమంటే చాలా ఇష్టం. రెడీ- నుంచే రామ్ తో సినిమా చేయాల నుంది. అది ఇప్పుడు నెరవేరు తోంది' అన్నారు తమన్నా. సుమన్, రఘుబాబు, రిషి, షాయాజి షిండే, నాగినీడు, మేల్కోటే తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పాటలు: రామజోగయ్య శాస్ర్తి, సంగీతం: జి.వి. ప్రకాష్‌కు మార్, శ్రీమణి, సమర్పణ: కృష్ణ చైతన్య.


Click it and Unblock the Notifications











