భారీ చిత్రాల దర్శకుడు బి.గోపాల్ , నిర్మాత యమ్.యస్.రాజు మొదటి సారి ఒకటయ్యారు. వారిద్దరూ కాంబినేషన్లో రానున్న చిత్రానికి 'జోష్' అని టైటిల్ నిర్ణయించారు. గత కొంతకాలంగా పరాజయాలను ఎదుర్కొకుంటున్న వీళ్ళద్దరూ ఈ సారి ఎలాగైనా మెగా హిట్ నిచ్చి తమను తాము నిలబెట్టుకోవాలనే ప్రయత్నాలలో ఉన్నారు. అందుకే కథ పై పూర్తి స్థాయి కసరత్తు చేసి మాసాలా ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దారని చెప్పుకుంటున్నారు. ఇక 'దేవదాసు' తో పరిచయమై యూత్ లో క్రేజ్ సంపాదించుకున్న హీరో రామ్, హాట్ హీరోయిన్ హన్సిక జంటగా ఈ చిత్రంలో కనిపించనున్నారు. మరో హీరోయిన్ గా తమన్నా తన అందాలను ఆరబోయనుంది. చక్రి ఈ చిత్రానికి సంగీతం ఇవ్వటానికి సిద్దపడుతున్నాడు. దర్శక,నిర్మాతలు కసితో చేస్తున్న ఈ సినిమా భాక్సాఫీస్ జోష్ గా నిలబడి సంచలనం రేపుతుందని ఆశిద్దాం.