తొలిప్రేమ దర్శకుడు చిర కాల విరామం తర్వాత ఉల్లాసంగా ఉత్సాహంగా అనే చిత్రంతో మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చారు. దాంతో ఇప్పుడాయన మరో రెండు యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ కి శ్రీకారం చుట్టటానికి రెడీ అవుతున్నారని అంతర్గత వర్గాల ద్వారా తెలుస్తోంది. వాళ్ళు మరెవరో కాదు...తరుణ్,రామ్. ప్రస్తుతం తరుణ్ క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో శశిరేఖా పరిణయం చేస్తున్నారు. ఇక రామ్ మెగా డైరక్టర్ బి.గోపాల్ దర్శకత్వంలో మస్కా చిత్రం చేస్తున్నాడు. వీళ్ళిద్దరికీ కరుణాకరన్ కధలు వినిపించినట్లు తెలుస్తోంది. అలాగే వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని,స్క్రిప్టుకి తుది మెరుగులు దిద్దుకుంటున్నాడని సమాచారం. జానేతూ లాంటి ఫన్ ఎంటర్ టైనర్ తో రామ్ ను ప్రెజెంట్ చేయనున్నారని వినిపిస్తోంది.