twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గణేష్ గా రామ్

    By Staff
    |

    దేవదాసు చిత్రంతో పరిచయమైన హీరో రామ్. ఆచితూచి సినిమాలు చేస్తున్న రామ్ కెరీర్ లో రెఢీ లాంటి ఘనవిజయాన్ని అందించిన శ్రీ స్రవంతి మూవీస్ పతాకం పై రూపొందుతున్న మరో చిత్రం గణేష్. జస్ట్ గణేష్ అనేది ఉపశీర్షిక. స్రవంతి రవి కిషోర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా శరవనన్ దర్శకుడుగా పరిచయమౌతున్నారు. మిల్కీ వైట్ బ్యూటీ కాజల్ కథానాయిక. ఇటీవలే అరకులో ఓ పాట చిత్రీకరణ పూర్తి చేసారు.

    మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. క్లైమాక్స్, మరో రెండు పాటలు చిత్రీకరించాల్సిన ఈ చిత్రాన్ని సెప్టెంబరు ద్వితియార్థంలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆగష్ట్ 6 నుండీ చివరి షెడ్యూల్ ప్రారంభించనున్నారు. రెఢీ చిత్రంలో స్పైడర్ మ్యాన్, క్రిష్ గెటప్స్ తో చిన్నపిల్లల్ని అలరించిన రామ్ ఈ చిత్రంలో 21 మంది బాలనటులతో చేసిన సన్నివేశాలు పిల్లల్ని బాగాఆకట్టుకొంటాయని, అలాగే యూత్ ని, మాస్ ఆడియెన్స్ ని అలరించేలా ఈ సినిమా ఉంటుందని రవి కిషోర్ అంటున్నారు. ఈ చిత్రం ఎలా ఉండబోతోందో తెలుసుకోవాలంటే సెప్టెంబరు వరకు ఆగాల్సిందే.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X