రామ్, హన్సిక జంటగా సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బానర్‌పై యమ్మెస్ రాజు నిర్మిస్తున్న కొత్త చిత్రం రెగ్యులర్ షూటింగ్ గురువారం మొదలైంది. ప్రతిధ్వని, బొబ్బిలి రాజా,సమరసింహా రెడ్డి,నరసింహనాయుడు వంటి బ్లాక్ బస్టర్స్ అందించిన సీనియర్ డైరెక్టర్ బి. గోపాల్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ చిత్రంలో రామ్ టీవీ రిపోర్టర్‌గా గా కనిపించనున్నాడు. ఈ చిత్రానికి 'జోష్' అనే టైటిల్ పరిశీలనలో వుంది. ఇందులో తమన్నా రెండో హీరోయిన్ గా నటిస్తోంది. 'నరసింహుడు' వంటి డిజాస్టర్ ఫిల్మ్ తర్వాత గోపాల్ డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇదే. మరోవైపు 'పౌర్ణమి' నుంచి వరుస ఫ్లాపులు ఎదుర్కొంటున్న యమ్మెస్ రాజు 'వాన' తర్వాత ఎంతో పకడ్బందీ ప్రణాళికతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తొలిసారిగా చక్రి ఈ బానర్‌లో సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. కాగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన 'రెడీ' సినిమా జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానున్నది.