మండుతున్న ముక్కు , నీళ్లు కారుతున్న కళ్లతో రామ్

By Srikanya

హీరో రామ్ ప్రస్తుతం తన పరిస్ధితి గురించి చెపుతూ... ''గుంటూరులో ఉన్న ఘాటంతా ఈ మిర్చీ యార్డ్ లోనే ఉన్నట్లుంది. మండుతున్న ముక్కు, నీళ్లు కారుతున్న కళ్లతో, దగ్గుతో పరిస్థితి డిఫరెంట్‌గా ఉంది'' అన్నారు. 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో రామ్ నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్ గుంటూరులో జరుగుతోంది. సిటీలోని ఓ పెద్ద మార్కెట్ యార్డ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సందర్భంగా రామ్ ..గుంటూరు లో మకాం వేసారు.

అలాగే గుంటూర్ లో ఎండలు మండిపోతున్నాయ్. భరించలేనంత వేడిగా ఉన్నా చాలా ఎక్సయిటింగ్‌గా ఉందని రామ్ అన్నారు. దానికి కారణం ఈ చిత్రకథ కొత్తగా ఉండటం, తన లుక్ కూడా కొత్తగా ఉండటమేనని అని తెలిపారు. ఇది తన జీవితంలో ఒక కొత్త 'ఫేజ్' అని కూడా ఆయన చెప్పారు. రామ్ కెరీర్ లో తొమ్మిదో చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఓ తమిళ హీరోయిన్ నటిస్తోంది. జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఫ్యామిలీ ఓరియెంటెడ్ యాక్షన్ చిత్రమని చెప్తున్నారు.

ప్రస్తుతం రామ్, తమన్నా జంటగా ప్రముఖ దర్శకుడు కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఎందుకంటే ప్రేమంట' రిలీజ్ కు రెడీగా ఉంది. స్రవంతి రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న జూన్ 1 న విడుదల చేసేందుకు ప్లాన్ చేసారు. అయితే అనుకోని కారణాలు వలన జూన్ 8 కి ఈ చిత్రం వాయిదా వేసారు. అదే రోజున ఈ చిత్రాన్ని తమిళంలో 'ఎన్ ఎండ్రల్ కాదల్ ఎన్‌బెన్' పేరుతో విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజీలో ఉన్న ఈ చిత్రం క్యూట్ రొమాంటిక్ స్టోరీగా చెప్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం ఆడియో విడుదలై ఛార్ట్ బస్టర్ గా నిలిచింది.

ఈ చిత్రం గురించి హీరో రామ్ మాట్లాడుతూ- యువతరాన్ని వెంటాడే ప్రేమ కథగా ఈ చిత్రం రూపొందుతుందని, కరుణాకరన్ కలర్‌ఫుల్‌గా చిత్రీకరించాడని చెప్పారు. అలాగే జెనీవా స్విట్జర్లాండ్‌లలో షూట్ చేసిన పాటలు హైలెట్‌గా ఉంటాయని తెలిపారు. రాధికా ఆప్టే, సుమన్, షాయాజిషిండే, రఘుబాబు, సుమన్‌శెట్టి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్, నిర్మాత: పి.రవికిషోర్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కరుణాకరన్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X