రామ్, బొమ్మరిల్లు భాస్కర్ చిత్రం ఓపినింగ్ విశేషాలు
రామ్,బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో భారీ చిత్రాల నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న కొత్త చిత్రం ఓపినింగ్ ఈ రోజు(మార్చి 9) చిత్రం కార్యాలయంలో ఉదయం జరిగింది. హీరో రామ్ పై ప్రమఖ నిర్మాత స్రవంతి రవికిషోర్ క్లాప్ కొట్టగా,చిత్ర సమర్పకులు భోగవల్లి బాపినీడు కెమెరా స్విచ్ ఆన్ చేసారు. ఈ ప్రారంభోత్సవానికి ప్రముఖ దర్సకుడు రాజమౌళి, ఆయన సతీమణి రమా రాజమౌళి హాజరయ్యారు.
ఈ చిత్రం గురించి బొమ్మరిల్లు భాస్కర్ మాట్లాడుతూ...ఇది ఓ మంచి కమర్షియల్ ఎంటర్టైనర్. రామ్ తో చేస్తున్న మొదటి సినిమా. రెండు మూడేళ్లుగా రామ్,నేనూ కలిసి ఓ మంచి కమర్షియల్ సినిమా చెయ్యాలని డిస్కస్ చేసుకుంటున్నాం. రామ్ ఎనర్జీకి తగ్గట్లుగా మంచి ఎనర్జిటిక్ స్క్రిప్ట్ రెడి అయ్యింది. రామ్ తో చెయ్యండం చాలా హ్యాపీ. అలాగే నిర్మాత ప్రసాద్ గారు నాకు పన్నెండేళ్లుగా ఎడిటర్ మోహన్ గారి దగ్గర పనిచేస్తున్నప్పటి నుంచీ తెలుసు. ఈ చిత్రంలో రామ్ క్యారెక్టర్ ఢిఫెరెంట్ గా ఉంటుంది. ప్రకాష్ రాజ్ ఓ ప్రత్యేకమైన పాత్రలో కనిపిస్తారు. మిగతా వివరాలు త్వరలో తెలియచేస్తాను అన్నారు. ఈ చిత్రానికి మాటలు..కోన వెంకట్, సంగీతం జివి ప్రకాష్, ఫోటో గ్రపి..ఎ వెంకటేష్, ఎడిటింగ్..మార్తాండ్ కె.వెంకటేష్, ఆర్ట్ కదీర్, కధ..స్క్రీన్ ప్లే,దర్శకత్వం.. భాస్కర్.


Click it and Unblock the Notifications











