Don't Miss!
- Sports PBKS vs MI: ఆ తప్పిదంతోనే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: సామ్ కరణ్
- News పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
విమర్శలు రాకుండా ‘కాటమరాయుడు’పై రామ్ చరణ్ స్పందన!
తన ఎఫ్.బి పేజీ ద్వారా కాటమరాయుడు ట్రైలర్ షేర్ చేసిన చరణ్.... బాబాయ్ లుక్ పవర్ ఫుల్ గా ఉందని ప్రశంసించాడు. మన అందరి కాటమరాయుడు ఈ నెల 24న థియేటర్లలోకి వస్తున్నాడు సిద్ధంగా ఉండండి అంటూ అభిమానులకు పిలుపున
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన 'కాటమరాయుడు' మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ శనివారం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ నుండి ఎవరూ రాక పోవడంపై మళ్లీ రకరకాల ప్రచారం మొదలైంది.
అయితే ఈ విషయంలో ఎలాంటి పుకార్లు రాకుండా రామ్ చరణ్ స్పందించారు. తన ఎఫ్.బి పేజీ ద్వారా కాటమరాయుడు ట్రైలర్ షేర్ చేసిన చరణ్.... బాబాయ్ లుక్ పవర్ ఫుల్ గా ఉందని ప్రశంసించాడు. మన అందరి కాటమరాయుడు ఈ నెల 24న థియేటర్లలోకి వస్తున్నాడు సిద్ధంగా ఉండండి అంటూ అభిమానులకు పిలుపునిచ్చాడు.
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ హీరోగా నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై కిషోర్ పార్థసాని దర్శకత్వంలో శరత్‌మరార్ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం కాటమరాయుడు. ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోగా నటిస్తోంది.
మార్చి 24న గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఇప్పటికే టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ మొదలవ్వడం... క్షణాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడు పోవడం కూడా జరిగిపోయింది. తమిళ మూవీ వీరమ్ చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.