ఆర్‌సి12: నిర్మాతకు కోట్లు రాకుండా రామ్ చరణే అడ్డుపడ్డారా?

By Bojja Kumar

Recommended Video

Ram Charan Boyapati Film Sold To 74 Crore

తన సినిమాకు కోట్ల రూపాయల ఆదాయం వస్తుంటే.... ఏ హీరో అయినా వద్దంటాడా? కచ్చితంగా అనరు. కానీ రామ్ చరణ్ తీసుకున్న నిర్ణయం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్య పరుస్తోంది. దీని వల్ల నిర్మాతకు రూ. 15 కోట్ల వరకు తక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మిస్తున్న ఆర్‌సి12 విషయంలో ఇది చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే చరణ్ తీసుకున్న నిర్ణయం ఈ వెనక చాలా ముందు చూపు ఉందని, రేపు ఏదైనా తేడా వస్తే పేరు చెడిపోతుందనే ఉద్దేశ్యంతోనే ఆయన ఇలా చేశారని అంటున్నారు.

ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే...

ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే...

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో జరిగే వ్యాపారం ఎలా ఉంటుందంటే.... ఒక హీరో సినిమా షేర్ ఎంత వసూలు చేస్తే, అతడి నెక్ట్స్ సినిమా అదే రేటుకు అమ్ముడుపోతుంది. రామ్ చరణ్ గత చిత్రం ‘రంగస్థలం' రూ. 125 కోట్లకుపైగా గ్రాస్, రూ. 92 కోట్లకు పైగా డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసింది. ఈ లెక్క ప్రకారం ఆర్‌సి12 థియేట్రికల్ రైట్స్ కనీసం రూ. 90 కోట్లకు అమ్ముడు పోవాలి.

కానీ అమ్మింది చాలా తక్కువ రేటుకే

కానీ అమ్మింది చాలా తక్కువ రేటుకే

అయితే ఇండస్ట్రీ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్య పరుస్తూ ఆర్‌సి12 థియేట్రికల్ రైట్స్ కేవలం రూ. 74 కోట్లకే అమ్మారట డివివి దానయ్య. నాన్ రిటర్నబుల్ బేసిస్‌లో యూవి క్రియేషన్స్ వారు ఈ చిత్రం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నట్లు సమాచారం.

 రామ్ చరణ్ సూచన మేరకే ఆ రేటు?

రామ్ చరణ్ సూచన మేరకే ఆ రేటు?

వాస్తవానికి ఆర్‌సి12 థియేట్రికల్ రైట్స్ రూ. 90 కోట్ల పై చిలుకు రేటుకు అమ్మాలని అనుకున్నారట దానయ్య. అయితే రామ్ చరణ్ కల్పించుకుని..... రూ. 74 కోట్లకు డీల్ సెటిల్ అయ్యేలా చేశాడని టాక్.

రామ్ చరణ్ ఎందుకలా చేశాడు?

రామ్ చరణ్ ఎందుకలా చేశాడు?

రామ్ చరణ్ ఇలా చేయడం వెనక ఓ కారణం ఉంది. ‘రంగస్థలం' అంత పెద్ద హిట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అదొక మెరాకిల్ హిట్. ఆ సినిమా విషయంలో వర్కౌట్ అయిన మ్యాజిక్ ఆర్‌సి12 విషయంలో వందశాతం వర్కౌట్ అవుతుందని చెప్పలేం. రేపు ఏదైనా తేడా వస్తే రామ్ చరణ్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. అందుకే చరణ్ ఈ నిర్ణయం తీసుకున్నారట.

సంక్రాంతి రిలీజ్

సంక్రాంతి రిలీజ్


ఇంకా టైటిల్ ఖరారు కాని ఆర్‌సి12 చిత్రాన్ని 2019 సంక్రాంతి సందర్భంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X