వివి వినాయక్ సినిమా కోసం రామ్ చరణ్ సిక్స్ ప్యాక్..!
వరుసగా మూడు చిత్రాలు వెంటవెంటనే చేస్తున్నానంటూ ప్రకటించిన రామ్ చరణ్ అంతకంటే ముందు తన లుక్స్ మార్చుకునే ప్రయత్నంలో ఉన్నట్టు చెప్పాడు. బాడీ బిల్డప్ చేసేందుకు గాను చరణ్ మయామీ జిమ్ కి వెళుతున్నట్టు పేర్కొన్నాడు. రాబోయే రోజుల్లో ఫుల్ బిజీ అయిపోతాడు కాబట్టి ఈ సమయాన్ని కొత్త లుక్ మీద వర్కవుట్ చేయడానికి వాడుకుంటున్నట్టు అతను తెలిపాడు.
ఆల్రెడి మంచి ఫిజిక్ ఉన్న చరణ్ ఇప్పుడు అంత దూరం వెళ్లి జిమ్ లో జాయిన్ అవడం ఎందుకని ఆరా తీయగా, మలి చిత్రంలో చరణ్ సిక్స్ ప్యాక్ తో కనిపిస్తాడని తెలిసింది. మగధీర లో షర్టు తీయాల్సి ఉన్నా సీన్స్ ఉన్నా కానీ సిక్స్ ఫ్యాక్ కోసం ట్రై చేయని చరణ్ త్వరలో మొదలయ్యే యాక్షన్ మూవీకి ఎక్స్ ట్రా ఎట్రాక్షన్ గా పనికొస్తుందని సిక్స్ ప్యాక్ బాట పట్టాడట.
ఆరెంజ్ తో క్లాస్ ఫిలిం ట్రై చేసి చేతులు కాల్చుకున్న చరణ్ ఇప్పట్లో మళ్లీ ప్రయోగాల జోలికి పోకుండా సేఫ్ జోన్ లో ఉండేందుకు కృషి చేస్తున్నాడు. చరణ్ చేయబోయే నెక్స్ ట్ మూడు సినిమాలు కూడా మాస్ ఎంటర్ టైనర్సే కావడం విశేషం.
కాగా నెక్ట్స్ రామ్ చరణ్ వివి వినాయక్ డైరెక్షన్ లో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అందుకోసం వివి వినాయక్ 'చిలుక" అనే కొత్త టైటిల్ ని ఫిలిం చాంబర్ లో రిజిస్టర్ చేయించాడని తెలిసింది. అది చరణ్ సినిమాకే అనే వార్తలు కూడా వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











