పెళ్లి కాకుండా రామ్ చరణ్ సహజీవనం
కంగారుపడకండి..ఈ సీన్ రామ్ చరణ్ నిజ జీవితంలోది కాదు. రామ్ చరణ్ తాజా చిత్రం జంజీర్ కధలోది. ఇందులో రామ్ చరణ్, ప్రియాంక చోప్రా పాత్రలు వివాహం కాకుండా సహజీవనం చేసే వ్యక్తులు. వీరి రొమాన్స్ ని దర్శకుడు అపూర్వ లఖియా వెండి తెర వేడిక్కేలా తెరకెక్కిస్తున్నాడని సమాచారం. ప్రస్తుతం బాలీవుడ్ ట్రెండ్ కి అణుగుణంగా అప్పటి జంజీర్ ని మార్చి మరీ తెరకెక్కిస్తూండటంతో ఈ మార్పు చోటు చేసుకుంది. అమిత్ మెహ్రా నిర్మిస్తున్న ఈ చిత్రం హిందీ, తెలుగు భాషల్లో రూపొందుతోంది. రామ్ చరణ్ కెరీర్ లో హాట్ రొమాన్స్ ఈ చిత్రంలోనే కనపడుతుందని అంటున్నారు.
ఆయిల్ మాఫియా బ్యాక్ డ్రాప్ తో జంజీర్ రీమేక్ ని రామ్ చరణ్ తో చేస్తున్నట్లు దర్శకుడు అపూర్వ లఖియా మీడియాతో చెప్పారు. అప్పటి కథని ఈ తరానికి తగినట్లు మార్చి స్క్రిప్టు తయారు చేసానని చెప్పుకొస్తూ ఈ విషయం వివరించారు. అలాగే జర్నిలిస్టు జె డి ని చంపే ఎపిసోడ్ ని కూడా ఈ స్క్రిప్టు లో కలుపుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక బాలీవుడ్ లో ఎస్టాబ్లిష్ అయ్యిన స్టార్ హీరోయిన్ ని రామ్ చరణ్ ప్రక్కన తీసుకోనున్నట్లు తెలిపారు. అలాగే రామ్ చరణ్ ని తన కథకు ఎంపిక చేసుకోవటం గురించి చెపుతూ...నేను ఓ యంగ్ ,ఎనర్జీ ఉన్న యంగ్ హీరో కోసం వెతికాను. జంజీర్ కథ కోపంతో రగిలిపోయే యాంగ్రీ యంగ్ మ్యాన్ కథ. ఈ రోజున బాలీవుడ్ లో ఇలాంటి పాత్రలు చేసే యంగ్ హీరోలు లేరు. అంతా మెట్రో సెక్సువల్ హీరోలే అన్నారు. ఆ ఫైర్ రామ్ చరణ్ లో కనిపించింది. అందుకే అతన్ని కలిసి ఒప్పించుకున్నాను అన్నారు.
గతంలో 'ముంబై సే ఆయా మేరా దోస్త్', 'ఏక్ అజ్‌నబీ', 'షూటవుట్ ఎట్ లోఖండ్‌వాలా' చిత్రాల్ని రూపొందించిన అపూర్వ లఖియా ఈ రీమేక్ కి దర్శకుడు. 1973లో సూపర్ హిట్ అయిన అమితాబ్ బచ్చన్ సినిమా 'జంజీర్'కు ఇది రీమేక్. రాంచరణ్ సరసన ప్రియాంకా చోప్రా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్, అర్జున్ రాంపాల్, మహీ గిల్ ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రాన్ని రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు అమిత్ మెహ్రా నిర్మిస్తున్నాడు. పాత 'జంజీర్' దర్శకుడు ప్రకాశ్ మెహ్రా కుమారుడే ఈ అమిత్. తన తండ్రి సాధించిన విజయాన్ని ఈ చిత్రంతో కొనసాగించలనుకుంటున్నాని చెప్తున్నాడు.
రామ్ చరణ్ మాట్లాడుతూ.. నేను చాలా స్క్రిప్టులు బాలీవుడ్ ఎంట్రీ కోసం విన్నాను. వాటిలో ఏదీ నన్ను ఎక్సైట్ చేయలేకపోయింది. నేను లవర్ బోయ్ గా బాలీవుడ్ లో ఎంట్రీ అవ్వదలుచుకోలేదు. జంజీర్ చిత్రం నాలో ఉన్న ట్యాలెంట్ ని వెలికి తీస్తుందనిపిస్తోంది. నన్ను కొత్తగా ప్రెజెంట్ చేస్తుందని నమ్మకం ఉంది అని అన్నారు. ఇక మిగతా వివరాలు చెప్పటానికి ఆయన ఆసక్తి చూపలేదు. ఈ జంజీర్ చిత్రం రీమేక్ ని రిలియన్స్ బ్యానర్ పై అమిత్ మెహ్రా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ ఓ గెస్ట్ పాత్రలో కనిపించనున్నాడని బాలీవుడ్ సమాచారం.


Click it and Unblock the Notifications











