‘1-నేనొక్కడినే’మూవీ గురించి రామ్ చరణ్ ఇలా...
హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరో రామ్ చరణ్ దర్శకుడు సుకుమార్ తో పని చేయాలని కోరుకుంటున్నాడు. మంచి కథతో వస్తే తప్పకుండా చేస్తానని అంటున్నాడు. అంతే కాదు, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘1-నేనొక్కడినే' చిత్రం తనకు చాలా బాగా నచ్చిందని అంటున్నాడు.
టాలీవుడ్ బెస్ట్ డైరెక్టర్లలో సుకుమార్ కూడా ఒకరు. ఆయన కొత్త ఐడియాస్, సరికొత్త కాన్సెప్టులు నాకు బాగా నచ్చుతాయి. అల్లు అర్జున్‌తో సుకుమార్ చేసిన సినిమాలన్నీ నాకు బాగా నచ్చాయి. ముఖ్యంగా మహేష్ బాబుతో చేసిన ‘1-నేనొక్కడినే' చిత్రం చాలా బాగా నచ్చింది. అదొక మంచి చిత్రం. ఆయన ‘1-నేనొక్కడినే' లాంటి సరికొత్త కాన్సెప్టు గల సినిమాలు మరిన్ని తీయాలని రామ్ చరణ్ ఆకాంక్షించాడు.

రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే....ఆయన తాజా సినిమా ‘గోవిందుడు అందరి వాడేలే' చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలు సాధిస్తోంది. రామ్ చరణ్ చేసిన తొలి ఫ్యామిలీ ఎంటర్టెనర్ సినిమా ఇది. ప్యామిలీ ప్రేక్షకుల నుండి ఆదరణ లభిస్తుండటంతో మంచి లాభాలు వస్తాయని భావిస్తున్నారు.
‘2015లో గౌతం మీనన్ దర్శకత్వంలో డైరెక్ట్ తమిళ సినిమా చేయాలనుకుంటున్నాడు రామ్ చరణ్. ఘర్షణ, ఏమాయ చేసావె, ఎటో వెళ్లి పోయింది మనసు చిత్రాల ద్వారా గౌతం మీనన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. వాస్తవికత ఉట్టిపడేలా, వైవిద్యంగా సినిమాలు తీయడం గౌతం మీనన్ స్టైల్. ఆయన దర్శకత్వంలో రామ్ చరణ్ తమిళ సినిమా చేస్తుండటంపై ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈచిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేయనున్నారు.


Click it and Unblock the Notifications











