ఆయన దయవల్లే ప్రమాదం నుంచి..: రామ్‌చరణ్
'ఆ రోజు సినిమా షూటింగ్‌లో జరిగిన ప్రమాదం నుంచి బయటపడ్డానంటే కారణం అయ్యప్ప కరుణా కటాక్షాల వల్లే. ఇదనే కాదు, జీవితంలో ఎన్నో విషయాల్ని తెలుసుకునే అవకాశం అయ్యప్ప దీక్ష చేయటం ద్వారా నాకు లభించింది' అని హీరో రామ్‌చరణ్ అంటున్నారు. రామ్‌చరణ్ అయ్యప్ప మాల ధరించటం ఇది ఏడోసారి. ఈ సందర్భంగా శబరిమల వెళ్లి అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు. వీటి అనుభవాల్ని రామ్‌చరణ్ ఈ విధంగా చెబుతున్నారు... 'ఆస్తులు, అంతస్తులు, సౌకర్యాలు ఇవి కాదు ముఖ్యం. కాళ్లు ఎప్పుడూ నేలపైనే ఉండాలి...అనేది తెలుసుకున్నా. దీక్ష వల్ల ప్రశాంతంగా ఉండి పనులపై ఏకాగ్రత పెరిగింది. శబరిమల యాత్ర చాలా గొప్పగా జరిగింది. ఇద్దరు స్నేహితులు కూడా వెంట ఉన్నారు. యాత్రలో భాగంగా సాగిన నడక, అక్కడి వాతావరణం ఇప్పటికీ నా మనస్సులో ఉండిపోయింది. దీక్ష వల్ల మన మనస్సులో ప్రశాంతత, జీవితంలో బ్యాలెన్స్ తీసుకొస్తుందని యువతకు, బిజినెస్‌మెన్స్‌కు సలహా కూడా ఇస్తున్నా'నని ఆయన అన్నారు.
ఇక రామ్ చరణ్ వచ్చే నెలలో తన లాంగ్ టైమ్ గర్ల్ ప్రెండ్ ఉపాసనా కామినేని తో ఎంగేజ్ మెంట్ కానున్నారు. ఇక రచ్చ చిత్రం షూటింగ్ స్పీడుగా జరుగుతున్నా...రిలీజ్ డేట్ మాత్రం ఇప్పటివరకూ ఫిక్స్ చేయలేదు.రామ్ చరణ్ తన తాజా చిత్రం రచ్చ గురించి మాట్లాడుతూ....ఈ చిత్రం టాలీవుడ్ లో ఓ ఉదాహణగా నిలిచిపోతుంది. తక్కువ ప్రొడక్షన్ కాస్ట్ తో ఎంత ఎక్కువ సినిమాటెక్ వ్యాల్యూస్ తో తీయవచ్చు అనే విషయంలో. మేము ఈ సినిమా పూర్తికాగానే ఎంత ఖర్చు అయ్యింది..ఎలా ఖర్చు పెట్టాం అనే విషయాలను తెలియచేస్తాం అన్నారు రామ్ చరణ్.
ఇక రచ్చ దర్శకుడు సంపత్ నంది గురించి చెపుతూ..నేను చాలా ఎగ్జైట్మెంట్ తో ఉన్నాను..అలాంటి పాత్రను నేను ఎప్పుడూ ఊహించుకోలేదు. నా ఫ్యాన్స్ నానుంచి ఎలాంటి సినిమా ఎక్సపెక్ట్ చేస్తారో ఖచ్చితంగా అలాంటిదే ఇది. ఈ స్క్రిప్టుని సంపత్ నంది చాలా జాగ్రత్తగా వర్క్ చేసి తెరకెక్కిస్తున్నారు. అతను చాలా ప్రతిభావంతంగా పనిచేస్తున్నాడు అన్నారు. ఇక రచ్చ చిత్రాన్ని క్రిసమస్ కానుకగా విడుదల చేయాలని రామ్ చరణ్ చెప్తున్నారు. పూర్తిస్థాయి యాక్షన్ చిత్రంగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంకోసం రామ్ చరణ్ మియామి, అమెరికలో మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. తమన్నా రామ్ చరణ్ తో జోడికడుతున్న ఈ సినిమాలో చరణ్ మిడిల్ క్లాస్ కుర్రాడుగా పక్కా మాస్ పాత్రను చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ 'రచ్చ'సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని ప్రతిస్టాత్మకంగా నిర్మిస్తుంది.


Click it and Unblock the Notifications











