నాన్న కోసం రెండు స్టోరీలు రెడీ : రామ్ చరణ్

By Bojja Kumar

హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా చేస్తే చూడాలని అభిమానులు ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అభిమానులు మాత్రమే కాదు....చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కూడా నాన్న 150 సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన సినిమా చేయడానికి ఒప్పుకుంటే దానికి నేనే నిర్మాత అంటూ ఇప్పటికే ప్రకటించారు కూడా.

తాజాగా మరో ఆసక్తికర విషయం వెల్లడించారు రామ్ చరణ్. నాన్న కోసం ఇప్పటికే రెండు స్టోరీలు రెడీ అయ్యాయని, ఆయన ఆ స్టోరీలు విని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే తరువాయి అని వెల్లడించారు. అయితే చిరంజీవి 150వ సినిమా ఎప్పుడు చేస్తారు? అనే గ్యారంటీ మాత్రం ఇవ్వలేను అంటున్నారు చరణ్.

ఇక రామ్ చరణ్ విషయానికొస్తే...రామ్ చరణ్ త్వరలో కృష్ణ వంశీ దర్శకత్వంలో మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నరంటూ గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు నిజమేనని, వెంకటేష్ గారితో కలిసి పని చేయబోతున్నట్లు రామ్ చరణ్ వెల్లడిచారు.

ప్రస్తుతం రామ్ చరణ్ నటించిన తొలి బాలీవుడ్ మూవీ 'జంజీర్' విడుదలై ప్రేక్షకులు, క్రిటిక్స్ నుంచి మిశ్రమ స్సందన సొంతం చేసుకుంది. తెలుగు వెర్షన్ 'తుఫాన్' విషయంలో కూడా వీక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. మరో వైపు చరణ్ నటించిన 'ఎవడు' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. రాష్ట్రంలో నెలకొన్న ఉద్యమ వాతావరణం కాస్త చల్లబడ్డాక ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X