Just In
- 5 hrs ago
అందుకే ఆ టైటిల్ పెట్టాం.. ‘చెప్పినా ఎవరూ నమ్మరు’పై హీరో కమ్ డైరెక్టర్ కామెంట్స్
- 6 hrs ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు ముద్దులు.. లిప్ కిస్‌తో భర్తతో శ్రియ రచ్చ
- 6 hrs ago
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- 6 hrs ago
శ్రీను వైట్ల ఓ శాడిస్ట్.. మంచు విష్ణు సెన్సేషనల్ కామెంట్స్
Don't Miss!
- News
రిపబ్లిక్ డే వాయెలెన్స్: పార్లమెంట్ మార్చ్ వాయిదా: రైతు సంఘాలు
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
తొలి సినిమా నిర్మాతగా టెన్షన్ ఉంది: చిరు 150వపై రామ్ చరణ్
ఆగస్టు 22(నేడు)న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని మెగా ఫ్యాన్స్ 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఏపీ, తెలంగాణలోని పలు దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈసారి మెగాస్టార్ తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 150వ సినిమాలో నటిస్తున్నారు కాబట్టి ఈ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ని మెగా ఫ్యాన్స్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిర్వహించారు. ప్రఖ్యాత దేవాలయాల్లో హోమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. నేడు ఫిలింనగర్ (హైదరాబాద్) దైవసన్నిధానంలో పూజా మహోత్సవాల ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ ముగింపు పూజల్లో 150వ సినిమా నిర్మాత, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చరణ్ అభిమానులను ఉద్ధేశించి మాట్లాడారు. ఘనంగా మెగాస్టార్ పుట్టినరోజు సంబరాలు చేసినందుకు అభిమానులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంత పెద్ద స్థాయిలో ఫ్యాన్స్ పూజా కార్యక్రమాలు చేయడం తనకి చాలా ఆనందాన్నిచ్చిందని చరణ్ అన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మెగాస్టార్ స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఫ్యాన్స్‌కి కృతజ్ఞతాభివందనాలు తెలియజేశారు చరణ్.
ఈ సందర్భంగా రామ్‌చరణ్ మాట్లాడుతూ -వారం, పదిరోజులుగా అభిమానులు పెద్ద ఎత్తున ఏపీ, తెలంగాణలోని దేవాలయాల్లో మెగాస్టార్ కోసం.. పూజలు ఘనంగా నిర్వహించారు. అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు స్వామినాయుడు స్వీయసారథ్యంలో ఈ పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. అభిమానులందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు. ఫిలింనగర్ దైవసన్నిధానంలో ఆఖరి పూజా మహోత్సవాలకు హాజరవ్వడం సంతోషాన్నిచ్చింది. అభిమానులు ప్రతి సంవత్సరం ఇలా పుట్టినరోజు వేడుకల్ని ఆసక్తిగా జరుపుతున్నారు. అందుకు ధన్యవాదాలు. ఈరోజు సాయంత్రం శిల్పకళా వేదికలో జరుగుతున్న ఫస్ట్‌లుక్ లాంచ్ కార్యక్రమానికి నేను వస్తున్నా. వరుణ్‌తేజ్, బన్ని, బాబాయ్ నాగబాబు.. హాజరవుతున్నారు. నాన్నగారు ప్రతియేటా పుట్టినరోజు వేళ ఏదైనా ఫామ్‌హౌస్‌లో సింపుల్‌గా గడిపేస్తారు. ఇప్పుడిలా నాన్నగారి పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కోసం ఖైదీ నంబర్ 150 లుక్ రిలీజ్ చేయడం.. ఈ సందర్భంగా అభిమానుల్ని కలవడం సంతోషంగా ఉంది. కథానుసారం ఈ సినిమాలో కథానాయకుడు ఖైదీ పాత్రలో కనిపిస్తారు కాబట్టి ఆ సినిమాకి ఆ టైటిల్ ని నిర్ణయించాం. కథకు దగ్గరగా ఉండే టైటిల్ ఇది. నిజానికి ఇప్పుడే ఫస్ట్‌లుక్ రిలీజ్ అంటే చాలా ముందస్తు అవుతుంది. దీపావళి తర్వాత రిలీజ్ చేయాలనుకున్నాం. కానీ ఫ్యాన్స్ కోరిక మేరకు ఫస్ట్‌లుక్ టీజర్ లాంచ్ చేస్తున్నాం అన్నారు.

టెన్షన్ అధిగమించి బాధ్యతగా ఉన్నా:
నిర్మాతగా తొలి ప్రయత్నం ఎలాంటి అనుభవాలిచ్చింది? అని ప్రశ్నిస్తే.. తొలి సినిమా నిర్మాతగా టెన్షన్ ఉన్నా.. అంతకుమించి బాధ్యతగా పని చేస్తున్నాను. దర్శకుడు వి.వి.వినాయక్ గారు పెద్ద అండ. అన్నీ ఆయనే అయ్యి పూర్తి సపోర్టు ఇస్తున్నారు. సగం (గంటన్నర) సినిమా చిత్రీకరణ పూర్తయింది. కొన్ని పాటలు, టాకీ, ఫైట్స్ తెరకెక్కించాల్సి ఉంది అని చరణ్ తెలిపారు.