ఖరారు :చిరు 150వ సినిమా ఎనౌన్స్ మెంట్ డేట్

By Srikanya

హైదరాబాద్ : 'అక్టోబర్ 16న నాన్నగారి 150వ సినిమా అనౌన్స్‌మెంట్ ఉంటుంది. దానిగురించి ఇప్పుడే ఏమీ చెప్పను. జనవరి తర్వాత ఆ సినిమా సెట్స్‌పైకి వెళుతుంది. ఇక నేను కూడా మరో రెండు నెలలు ఖాళీయే కాబట్టి ఇప్పుడిక నాన్న 150వ సినిమాపైనే పూర్తి శ్రద్ధ పెడుతున్నా.' అన్నారు రామ్ చరణ్. తన తాజా చిత్రం బ్రూస్ లీ ప్రమోషన్ లో భాగంగా కలిసిన మీడియాతో మాట్లాడుతూ ఆయన ఇలా వెల్లడించారు.

ఇక... కొద్ది రోజుల క్రితం..."నాకు పూరి జగన్నాథ్ నేరేట్ చేసిన కథ సెకండాఫ్ నచ్చలేదు ," అంటూ చిరంజీవి తన 150 వ చిత్రం గురించి చాలా కాలం తర్వాత నోరు విప్పారు. ఆయన తెలుగులో ఓ లీడింగ్ టీవి ఛానెల్ తో మాట్లాడుతూ ఇలా స్పందించారు. ఓ మూడు నెలల లోపు స్క్రిప్టుని ఫైనలైజ్ చేసి పట్టాలు ఎక్కిస్తామనే ధీమాగా ఆయన చెప్పుకొచ్చారు. చిరంజీవి, పూరి కాంబినేషన్ లో ఆటో జాని చిత్రం వస్తుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చిరంజీవి ఇలా చెప్పి దానికి అడ్డుకట్ట వేసారు.

వివి వినాయిక్ తోనే చిరంజీవి ముందుకు వెళ్తాడని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు నిమిత్తం ఇండస్ట్రీలోని టాప్ రైటర్స్ చేత కథలు సిద్దం చేస్తున్నట్లు వార్త. వాటిలో ఒకటి ఫైనలైజ్ చేస్తారని అంటున్నారు.

Ram Charan about Chiru’s 150th film

అందుతున్న సమాచారాన్ని బట్టి చిరంజీవి తన 150వ మెసేజ్ ఓరియెంటెడ్ లాగ కాకుండా ఓ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా చూడాలనకుంటున్నారని, అది లాండ్ మార్క్ గా నిలిచిపోయేలే చేయాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.

చిరంజీవి అంచనాల మేరకు ఏ స్క్రిప్టు ఓకే కాకపోవటంతో ప్రాజెక్టు డిలే అవుతూ వస్తోంది. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తారు...చిరంజీవి గారి సతీమణి సురేఖ సమర్పిస్తారు. మరో ప్రక్క చిరంజీవి ఈలోగా రామ్ చరణ్ తాజా చిత్రం బ్రూస్ లీ లో గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు.

‘బ్రూస్ లీ' విశేషాలకు వస్తే...

‘బ్రూస్ లీ'...ది ఫైటర్ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. నిన్న (ఆదివారం) రాత్రి కల్లా రీ రికార్డింగ్ పనులతో పాటు డిటిఎస్ పనులు కూడా పూర్తి అయ్యాయి. వాటితో ఫస్ట్ కాపీ రెడీ అయిపోయింది. ఈ చిత్ర టీం ఈ రోజు ఈ సినిమాని సెన్సార్ కి పంపాలని సెన్సార్ స్లాట్ ని కూడా బుక్ చేసేసారు.

రేపు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాగానే ఈ చిత్ర టీం ప్రమోషన్స్ లో మరింత జోరు చూపనుంది. ఇప్పటికే రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ లు ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. సిస్టర్ సెంటిమెంట్ ఎక్కువ ఉన్న ఈ సినిమాకి యాక్షన్, కామెడీని కూడా పర్ఫెక్ట్ గా శ్రీను వైట్ల మిక్స్ చేసాడని చెప్తున్నారు. ఇటీవలే రిలీజ్ అయిన ఆడియోకి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందించాడు. డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గా రామ్ చరణ్ కెరీర్లోనే అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X