అమ్మ కళ్లలో కన్నీళ్లు చూశాను, అంతకంటే ఏం కావాలి? రామ్ చరణ్

By Bojja Kumar

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో రెండు రోజుల్లో చిట్టిబాబుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో చరణ్ నటించిన 'రంగస్థలం' చిత్రం మార్చి 30న విడుదలకు సిద్ధమైంది. సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న చరణ్ మీడియా ఇంటర్వ్యూల్లో బిజీ అయ్యారు. సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు.

Recommended Video

Chiranjeevi Gifted Ram Charan A Expensive Gift
సరికొత్త క్యారెక్టరైజేషన్

సరికొత్త క్యారెక్టరైజేషన్

‘రంగస్థలం' చిత్రంలో తన కెరీర్లో ఇప్పటి వరకు చేయని సరికొత్త క్యారెక్టరైజేషన్లో ‘చిట్టిబాబు'గా కనిపించబోతున్నానని రామ్ చరణ్ తెలిపారు. ఈ పాత్రకు చెవుడు ఉండటం కథలో ఎంతో కీలకం అని రామ్ చరణ్ తెలిపారు.

మొదటి మాట నీకు చెవుడు అన్నాడు

మొదటి మాట నీకు చెవుడు అన్నాడు

సినిమా కథ చెప్పు అనగానే మొదటి మాట నీకు చెవుడు అన్నాడు. దీంతో నేను గట్టిగా నవ్వాను. క్యారెక్టరైజేషన్ ఒకే చెబితేనే నేను కథ చెబుతాను, లేక పోతే చెప్పను అన్నాడు. అలాంటి పాత్రలో నటించడానికి ఒప్పుకున్న తర్వాతే కథ చెప్పడం ప్రారంభించారు. కథ, స్క్రీన్ ప్లే ఎంతో అద్భుతంగా అనిపించింది అని చరణ్ వెల్లడించారు.

నాతో పాటు నాన్నగారు షాకయ్యారు

నాతో పాటు నాన్నగారు షాకయ్యారు

ఇలాంటి క్యారెక్టరైజేషన్ అని తెలిసి ముందు నేను, నాన్న షాకయ్యాం. నాన్నగారు కూడా చెవుడు ఉన్న క్యారెక్టర్ వర్కవుట్‌ అవుతుందా?' అని డౌట్ పడ్డారు. అయితే కథంతా విన్న తరవాత ఆయనకు బాగా నచ్చింది. ఇలాంటి మంచి పాత్ర వాడికి వచ్చినందుకు నటుడిగా ఈర్ష్య పడుతున్నాను అన్నారు... అని చరణ్ గుర్తు చేసుకున్నారు.

అమ్మ కళ్లలో నీళ్లు చూశాను

అమ్మ కళ్లలో నీళ్లు చూశాను

ఇటీవల వైజాగ్‌లో జరిగిన రంగస్థలం ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ... ఈ చిత్రానికి చాలా అవార్డుల వస్తాయన్నారు. అవార్డులు వస్తాయని మీరూ ఆశిస్తున్నారా? అనే ప్రశ్నకు చరణ్ స్పందిస్తూ... సినిమా మీద, నామీద ప్రేమతో ఆయన అలా అన్నారు. ఎప్పుడూ అవార్డుల గురించి ఆలోచించలేదు. అవార్డుల కంటే రివార్డులే ముఖ్యం. సినిమా చూశాక అమ్మ నన్ను దగ్గరకు తీసుకుంది. ఆ క్షణంలో అమ్మ కళ్లలో కన్నీళ్లు చూశాను. అవే ఎన్నో అవార్డులతో సమానం... అని ఓ పత్రిక ఇంటర్వ్యూలో రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.

అమ్మ ఒక బరువైన ఫీలింగ్‌లో ఉండిపోయారు

అమ్మ ఒక బరువైన ఫీలింగ్‌లో ఉండిపోయారు

సాధారణంగా అమ్మ నా సినిమాలు చూసినప్పుడు బావుంది, నీ క్యారెక్టర్‌ బావుందని చెబుతుంటారు. కానీ ఈ సినిమా చూశాక చేయి పట్టుకొని పక్కన కూర్చున్నారు. ‘ఒక ఐదు నిమిషాలు అలా పక్కన కూర్చోరా' అన్నారు. ఏం మాట్లాడలేదు. ఒకలాంటి బరువైన ఫీలింగ్‌లో ఉండిపోయారు. అది ఎక్స్‌ప్రెస్‌ చేయలేని ఫీలింగ్‌. చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది..... అని మరో పత్రిక ఇంటర్వ్యూలో రామ్ చరణ్ తెలిపారు.

ఉపాసన కూడా చాలా ఎంజాయ్ చేసింది

ఉపాసన కూడా చాలా ఎంజాయ్ చేసింది

రంగస్థలం షూటింగ్ జరిగినన్ని రోజులు చాలా ఎంజాయ్ చేశాను. సిటీలో పుట్టిపెరిగిన నాకు పల్లెటూరి వాతావరణం, గోదావరి, పాపికొండలు బాగా నచ్చింది. షూటింగ్ పూర్తయిన తర్వాత ఇంకొన్ని రోజులు ఉంటే బావుండు అనే ఫీలింగ్ కలిగింది. మారుమూల పల్లెల్లో షూటింగ్‌ చేశాం. ఆదివాసీలు ఉండే ప్రాంతాల్లో తిరిగాం. వాళ్ల జీవన విధానం, ఆహార అలవాట్లు ఇవన్నీ బాగా నచ్చాయి. ఉపాసన కూడా సెట్స్‌కు వచ్చేది. విహార యాత్రల పేరుతో ఇన్ని దేశాలు తిప్పావు ఇంతకంటే గొప్ప వాతావరణం ఎక్కడా కనిపించలేదు అని ఉపాసన అనేదని... చరణ్ తెలిపారు.

లుంగీలంటే చాలా ఇష్టం

లుంగీలంటే చాలా ఇష్టం

సినిమా షూటింగులో ప్రతి రోజూ ఎంజాయ్ చేశాం. షూటింగ్ అప్పుడే అయిపోయిందా? ఇంకొన్ని రోజులు ఉంటే బావుండు అనిపించింది. చిట్టి బాబు క్యారెక్టర్‌తో అంత బాండింగ్ ఉండటానికి కారణం ఆ క్యారెక్టరేజేషన్, ఆ పాత్ర లుంగీలో ఉండటం. నాకు లుంగీలంటే చాలా ఇష్టం. చాలా మందికి తెలియని విషయం నేను ఇంట్లో ఎక్కువగా లుంగీలే ప్రిఫర్ చేస్తాను. ఈ క్యారెక్టర్ అందరికీ కనెక్ట్ అయ్యేలా సుకుమార్ డిజైన్ చేయడం కూడా నచ్చింది అని చరణ్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X