'రచ్చ'లో రామ్ చరణ్ క్యారక్టరైజేషన్ ఏంటి?
రామ్ చరణ్ తాజా చిత్రం 'రచ్చ'లో అతనో డిఫెరెంట్ క్యారెక్టర్ ని పోషిస్తున్నారు. ఆ క్యారెక్టరే సినిమాని లీడ్ చేసి,హిట్ వైపు నడిపిస్తుందని భావిస్తున్నారు. ఆ క్యారెక్టర్ గురించి చరణ్ మాట్లాడుతూ..ఆరు బంతుల్లో ఆరు పరుగులు చేయాలంటే పోటీలో మజా ఉండదు. ఐదు బంతుల్ని వదిలేసి... ఆరో బంతి సిక్సర్ కొడితే అప్పుడే పేరొస్తుంది. అందుకే ఏం చేసినా మన సత్తా బయటపడేలా ఉండాలీ అనేది ఆ కుర్రాడి తత్వం. అవసరమైతే రచ్చరచ్చ చేసి గెలవాలీ అంటాడు. అలాంటి కుర్రాడి కధే మా రచ్చ సినిమా.. అంటున్నారు రామ్‌చరణ్.
తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి సంపత్‌నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్వీ ప్రసాద్, పారాస్‌జైన్ నిర్మాతలు. నిర్మాతలు ఈ చిత్రం గురించి మాట్లాడుతూ..''ఎప్పుడూ సై అంటే సై అనే ఓ యువకుడి కథ ఇది. వినోదం, యాక్షన్ అంశాలు మేళవించాం. చైనాకి చెందిన పోరాట నిపుణుల ఆధ్వర్యంలో చిత్రించిన ఫైట్స్ ఉత్కంఠను రేకెత్తిస్తాయి'' అన్నారునిర్మాతలు.ప్రస్తుతం కేరళలో హీరో,హీరోయిన్ లపై ఓ సాంగ్ ని షూట్ చేస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా పాటల్ని విడుదల చేస్తారు. మార్చిలో సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది. సమర్పణ: ఆర్.బి.చౌదరి, ఛాయాగ్రహణం: సమీర్‌రెడ్డి, సంగీతం: మణిశర్మ.


Click it and Unblock the Notifications











