తగ్గవాడితోనే పోటీ అంటున్న రామ్ చరణ్
రామ్ చరణ్, సంపత్ నంది కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'రచ్చ'. ఈ చిత్రంలో చరణ్ క్యారక్టైరైజేషన్ డిఫెరెంట్ గా ఉంటుందని చెప్తున్నారు. పాత్ర ప్రకారం... చరణ్ తనకు తగ్గవాడితోనే పోటీకి దిగుతాడు. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే పోటీ ఏకపక్షంగానే ఉంటుందటాడు. నిదానమే ప్రధానం అనే మాట అతనెప్పుడూ నమ్మడు. అలాగని పరుగెట్టి పాలు తాగే రకమూ కాదు. ఆ పరుగులేవో ప్రత్యర్థులకు పెట్టించి... తను మాత్రం తాపీగా కూర్చుంటాడు. ఇలాంటి మొండి ఘటం చేసే 'రచ్చ' చిత్రం..దాన్ని చూస్తేనే అర్థమవుతుంది అంటున్నాడు దర్సకుడు. అలాగే ఈ చిత్రంలో తన పాత్ర చాలా డిఫెరెంట్ గా ఉంటుందని చెప్తున్నారు రామ్ చరణ్. ఆయన మాట్లాడుతూ...చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం కాదు గానీ... రచ్చ రచ్చ చేస్తేగానీ వూరుకోడు. తెల్ల జెండా వూపి శాంతి శాంతి అంటూ గొడవ సద్దుమణిగించుకొందామన్నా వూరుకోడు. అటోఇటో తేలిపోవల్సిందే అంటాడు. ధైర్యంగా దూసుకుపోతూ... సై అంటే సై అనే ఆ యువకుడి లక్ష్యం ఏమిటో తెర మీదే చూడాలి అన్నారు.
ఇక ప్రేమిస్తే ప్రాణమిస్తాడు. అడ్డొస్తే... ఇక రచ్చ రచ్చే. ఇలాంటి మనస్తత్వం ఉన్న కుర్రాడే కధ రచ్చ. అతను సృష్టించిన హంగామా ఏ స్థాయిలో ఉంటుందో తెలియాలంటే కొంత కాలం ఆగండి అంటున్నారు నిర్మాత. తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రధాన తారాగణంపై పతాక సన్నివేశాల్లో వచ్చే ఫైట్స్ ని తెరకెక్కిస్తున్నారు. 'రచ్చ' కోసం ఫిల్మ్‌సిటీలో ప్రత్యేకంగా ఓ సెట్‌ని నిర్మించారు. మరో మూడు పాటలను చిత్రించాల్సి ఉంది. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా కోసం 'గ్యాంగ్ లీడర్'లోని 'వాన వాన వెల్లువాయె' పాటను రీమిక్స్ చేశారు. ఈ గీతం సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. ఫిబ్రవరిలో పాటల్నీ, మార్చిలో చిత్రాన్నీ విడుదల చేస్తారు. పూర్తిస్థాయి యాక్షన్ చిత్రంగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంకోసం రామ్ చరణ్ మియామి, అమెరికలో మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు.ఈ చిత్రం మాస్ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రచన: పరుచూరి బ్రదర్స్, ఛాయాగ్రహణం: సమీర్‌రెడ్డి, కూర్పు: గౌతంరాజు, కళ: ఆనంద్‌సాయి.


Click it and Unblock the Notifications











