అవసరమైతే నేనూ పరామర్శిస్తాను : రామ్ చరణ్

By Bojja Kumar

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హుధూద్ తుఫాన్ సహాయ నిధికి రూ. 50 లక్షలు విరాళం ఇవ్వడంతో పాటు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులను పరామర్శి స్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రామ్ చరణ్‌‌కు మీడియా నుండి వివిధ ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనిపై రామ్ చరణ్ స్పందిస్తూ అవసరమైతే నేనూ బాధిత ప్రాంతాల్లో పర్యటించిన పరామర్శిస్తానని వ్యాఖ్యానించారు.

మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ...నేను వెళ్లడం కన్నా....వాటర్, ఆహారం వెళ్లడం ముఖ్యం. గవర్నమెంటు చాలా బాగా రియాక్ట్ అయిందని రామ్ చరణ్ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

హుధూద్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో సహాయ కార్యక్రమాల కోసం సినీ నటుడు రామ్ చరణ్ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం రూ. 10 లక్షల విరాళం ప్రకటించారు. అదే విధంగా విశాఖలోని రామకృష్ణ మిషన్ కోసం రూ. 5 లక్షల విరాళం అందించారు. ఈ మేరకు ఆయన మంగళవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయం వెల్లడించారు. దీంతో పాటు 5 వేల పులిహోర ప్యాకెట్లు, 5 వేల బిస్కెట్ ప్యాకెట్లు, 5 వేల వాటర్ బాటిల్స్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

Ram Charan about Hudhud Cyclone

విలయంపై చరణ్ మాట్లాడుతూ...ఇలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినపుడు మనం చేసేది ఏమీ ఉండదు...ముందు జాగ్రత్త చర్యలు తప్ప. టెక్నాలజీ, మీడియా సహకారం వల్ల నష్టం చాలా దగ్గింది, మీడియా ద్వారా అందరినీ అప్రమత్తం చేయడం వల్లనే ఇది సాధ్యమైందన్నారు. మీడియాకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అని రామ్ చరణ్ వ్యాఖ్యానించారు.

తుఫాన్ సమయంలో పరిస్థితిని తెలుసుకోవడానికి అభిమానులతో మాట్లాడటానికి ప్రయత్నించారు. అయితే అక్కడ సెల్ ఫోన్ సిగ్నల్స్ పాడవ్వటం వల్ల ఏ ఒక్కరితోనూ మాట్లాడలేక పోయాను. ఈ ప్రాంతంలోని ప్రజలు, అభిమానులు మమ్మల్ని ఎంతగానో అభిమానించారు. ఈ ప్రాంతం నుండి మంచి కలెక్షన్లు వచ్చాయి. వారి కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశ్యంతో ఈ సహాయం చేస్తున్నట్లు రామ్ చరణ్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X