twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టెన్షన్ పెట్టిందంటూ ‘కొత్త జంట’పై రామ్ చరణ్ కామెంట్!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: అల్లు శిరీష్-రెజీనా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన కొత్త జంట చిత్రం ఈ రోజు విడుదలవుతున్న నేపథ్యంలో మెగా హీరో రామ్ చరణ్ తన ఫేస్ బుక్ పేజీలో స్పందించారు. తన కామెంట్స్ ద్వారా సినిమాకు హైప్ తెచ్చే ప్రయత్నం చేసారు. 'కొత్త జంట' సినిమాపై ఆసక్తి లేని వారిలో కూడా రామ్ చరణ్ వ్యాఖ్యల తర్వాత ఆసక్తి పెరుగుతోంది.

    హీరో అల్లు శిరీష్ గతంలో 'గౌరవం' అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ చిత్రం విసుగు తెప్పించడంతో శిరీష్ సినిమాలపై మెగా అభిమానుల్లో కూడా ఆసక్తి లేకుండా పోయింది. అందుకే మారుతి లాంటి దర్శకుడిని రంగంలోకి దింపి శిరీష్‌ను గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారు ఇతర మెగా హీరోలు. అందులో భాగంగానే రామ్ చరణ్ తన ఫేస్ బుక్ పేజీలో వ్యాఖ్యలు చేసినట్లు తేటతెల్లం అవుతోంది.

     Ram Charan about Kotha janta

    'ఇప్పుడే కొత్త జంట చూసాను. కామెడీతో కూడిన కొత్త లవ్ స్టోరీ. మొదట్లో ఈ సినిమా కాస్త టెన్షన్ పెట్టింది కానీ. సినిమా చూసిన తర్వాత టెన్షన్ అంతా పోయింది. అల్లు శిరీష్‌కు ఈ సినిమా పర్ ఫెక్ట్‌గా సూటయింది. దర్శకుడు మారుతి మంచి వర్క్ చూపించారు. సినిమా టీంకు, గీతా ఆర్ట్స్‌కు కంగ్రాట్స్' అంటూ రామ్ చరణ్ వ్యాఖ్యానించారు.

    ఈ చిత్రంలో నటీనటులుగా అల్లు శిరీష్, రెజీనా, మధురిమ, పోసాని కృష్ణ మురళి, ఆహుతి ప్రసాద్, రావు రమేష్, రోహిణి, సప్తగిరి, ప్రవీణ్, జోష్ రవి, మధు, సాయి పంపనా, ఏలూరు శీను తదితరులు నటించారు. సంగీతం: జేబి, ఎడిటింగ్: ఉద్ధవ్, ఆర్ట్: రమణ, యాక్షన్: విజయ్, డాన్స్: గణేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.కె.ఎన్, పి.ఆర్.ఓ: ఏలూరు శ్రీను, సమర్పణ: అల్లు అరవింద్, సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ప్రసాద్, నిర్మాత్: బన్నీ వాసు, కథ-మాటలు-స్ర్కీన్ ప్లే- దర్శకత్వం: మారుతి

    English summary
    
 “Just saw Kotha janta( hilariously Kotha love story) Was initially tensed but My brother Sirish nailed it right this time as a complete actor. Director Maruthi has done a superb job.Congrats to Geetha arts team.”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X