వరుణ్ తేజ్, సాయి తేజ్ పెళ్లిళ్లపై రామ్ చరణ్ కామెంట్.. వారి పెళ్లి ఎప్పుడంటే?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చాలా రోజుల తరువాత ఒక స్పెషల్ ఇంటర్వ్యూతో అభిమానులను ఆకట్టుకున్నారు. ఒక ప్రముఖ న్యూస్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక రకాల విషయాలపై స్పందించారు. ముఖ్యంగా టాలీవుడ్ లో ఇటీవల జరిగిన పెళ్లిళ్లపై అలాగే మెగా బ్యాచ్‌ల‌ర్స్ అయిన యువ హీరోలపై కూడా చరణ్ కొన్ని కామెంట్స్ చేశారు. అదే విధంగా RRR షూటింగ్ పై కూడా వివరణ ఇచ్చారు.

RRRపై వివరణ ఇస్తూ..

RRRపై వివరణ ఇస్తూ..

ముందుగా RRR గురించి మాట్లాడిన చరణ్.. అందులో రాజమౌళి గారు మమ్మల్ని చాలా కొత్తగా చూపించబోతున్నారు అంటూ సినిమా షూటింగ్ మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. అల్లూరి సీతారామరాజు పాత్ర నెవర్ బిఫోర్ అనేలా ఉంటుందని అయితే అంచనాలకు తక్కువకాకుండా బాధ్యతతో చూపించడానికి ట్రై చేస్తున్నామని అన్నారు.

మళ్ళీ షూటింగ్ ఎప్పుడంటే..

మళ్ళీ షూటింగ్ ఎప్పుడంటే..

RRR షూటింగ్ మళ్ళీ ఎప్పుడు మొదలవుతోందో తనకు తెలియదని చెబుతూ.. పరిస్థితులు చక్కబడిన తరువాతే మళ్ళీ వర్క్ మొదలుపేట్టే అవకాశం ఉందని అన్నారు. ఇక రాజమౌళి కరోనా నుంచి కోలుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన కరోనా సోకింది అనగమే కాల్ చేశాను అని చెప్పిన చరణ్ ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులకు మొత్తం నెగిటివ్ వచ్చిందని ఆ విషయం చాలా ఆనందాన్ని కలిగించిందని అన్నారు.

 రానా మంచి పని చేశాడు

రానా మంచి పని చేశాడు

టాలీవుడ్ హీరోలు పెళ్లిళ్ల గురించి మాట్లాడుతూ.. 'నిజంగా నితిన్, రానా వంటి హీరోలు పెళ్లి చేసుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. ముఖ్యంగా రానా దగ్గుబాటి మంచి పని చేశాడు అనుకుంటున్నా. ఎందుకంటే వాల్ల పేరెంట్స్ కి ఎక్కువ సంతోషాన్ని ఇచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంది. నిజంగా ఇదే విధంగా ఇంకొందరు పెళ్లిళ్లు చేసుకోవాలని కోరుకుంటున్నా' అని అన్నారు

వరుణ్, సాయి తేజ్ పెళ్లిళ్లపై కామెంట్

వరుణ్, సాయి తేజ్ పెళ్లిళ్లపై కామెంట్

నిహారిక ఎంగేజ్మెంట్ పై కూడా మాట్లాడిన రామ్ చరణ్ వేడుకకు కేవలం 50 మంది లోపే పాల్గొన్నారని అన్నారు. నిహారిక, చైతన్య జోడి కూడా చాలా బావుందని చెబుతూ.. మెగా బ్యాచ్‌ల‌ర్స్ పెళ్లిళ్లపై వివరణ ఇచ్చారు. మా ఫ్యామిలీలోనే ఇంకా కొంతమంది పెళ్లికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా వరుణ్ తేజ్, సాయి తేజ్ పెళ్లి వయసుకు వచ్చేశారు. వాళ్ళ పెళ్లిళ్ల కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు రామ్ చరణ తెలియజేశాడు.

Recommended Video

#NS20 : Director Sekhar Kammula On Naga Shourya's New Movie First Look
వారు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారంటే?

వారు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారంటే?

ఇక సాయి ధరమ్ తేజ్, వరుణ్ పెళ్లెప్పుడు చేసుకుంటారు అనే వివరాల్లోకి వెళితే.. ఇద్దరి వయసు కూడా 30లోనే ఉన్నాయి. సాయి ధరమ్ తేజ్ అయితే ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచనలో లేడని ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చేశాడు. ఇంట్లో వాళ్ళు కూడా పెద్దగా ఫోర్స్ చేయడం లేదని అన్నాడు. ఇక మరో హీరో వరుణ్ తేజ్ పెళ్లి మాత్రం 2021లో ఉండవచ్చని నాగబాబు గత ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. మరి వీరిద్దరిలో ఎవరు ముందు పెళ్లి కొడుకుగా దర్శనమిస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X