ఎన్టీఆర్ కెరీర్‌లో ఇదే బెస్ట్ అని తేల్చేసిన రాంచరణ్.. వాళ్లిద్దరూ అరవింద సమేతకు పిల్లర్లు!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన ఎమోషనల్ ఫ్యాక్షన్ డ్రామా అరవింద సమేత చిత్రం విజయపథంలో దూసుకుపోతోంది. ఎన్టీఆర్ తన పవర్ ఫుల్ పెర్ఫామెన్స్ తో మరో మారు అభిమానులని మంత్ర ముగ్ధుల్ని చేశాడు. దర్శకుడిగా, రచయితగా త్రివిక్రమ్ శ్రీనివాస్ సత్తా చాటాడు. అరవింద సమేత చిత్రంపై సినీ ప్రముఖుల ప్రశంసలు కొనసాగుతున్నాయి. తాజగా అరవింద సమేత చిత్రంపై మెగా పవర్ స్టార్ రాంచరణ్ స్పందించాడు.

ఎన్టీఆర్ కెరీర్‌లో బెస్ట్
అరవింద సమేత చిత్రంలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడని రాంచరణ్ ప్రశంసించాడు. ఎన్టీఆర్ కెరీర్ లో అద్భుతంగా నటించిన చిత్రాలలో అరవింద సమేత చిత్రం ఒకటి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శత్వం, మాటలు ఈ చిత్రానికి ప్రధాన బలం అని రాంచరణ్ తెలిపాడు.
వారిద్దరూ పిల్లర్లు
తమన్ సంగీత, విలాన్ పాత్రలో జగపతి బాబు నటన ఈ చిత్రానికి పిల్లర్లుగా నిలిచాయని రాంచరణ్ ప్రశంసించాడు. పూజ హెగ్డే నటన కూడా ఎంజాయ్ చేసే విధంగా ఉంది. అరవింద సమేత చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు అంటూ రాంచరణ్ సోషల్ మీడియా ద్వారా స్పందించాడు.

వంద కోట్లు దాటి
అరవింద సమేత చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. తొలి వీకెండ్ ముగిసే సమయానికి ఈ చిత్రం 100 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇదే వసూళ్లు కొనసాగితే అరవింద సమేత చిత్రం భారీ విజయం ఖాయం.ఓవర్సీస్ లో ఇప్పటికే అరవింద సమేత చిత్రం 1. 5 మిలియన్ డాలర్ల వసూళ్లతో దూసుకుపోతోంది.

ఫ్యాక్షన్ కథే కానీ
త్రివిక్రమ్ శ్రీనివాస్ అరవింద సమేత చిత్రాన్ని ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపొందించారు. ఇప్పటికే ఫ్యాక్షన్ నేపథ్యంలో అనేక చిత్రాలు వచ్చాయి. ఈ చిత్రం త్రివిక్రమ్ మార్క్, ఎన్టీఆర్ నటనతో సరికొత్త పంథాలో సాగుతుంది. యుద్ధం ముగిసాక పరిస్థితులు ఎలా ఉంటాయి అనే పాయింట్ ని త్రివిక్రమ్ ఈ చిత్రంలో బలంగా చూపించారు.
Recommended Video


ఫలించిన టీం వర్క్
త్రివిక్రమ్ దర్శత్వం, ఎన్టీఆర్ స్టామినాతో అరవింద సమేత చిత్రం భారీ వసూళ్లు రాబడుతోంది. అదేవిధంగా తమన్ అందించిన అద్భుతమైన సంగీతం, రామ్ లక్ష్మణ్ మాస్టర్ ఫైట్స్ ఈ చిత్రంలో మరో హైలైట్. ఇదిలా ఉండగా రాంచరణ్, ఎన్టీఆర్ కలసి త్వరలో రాజమౌళి దర్శత్వంలో నటించబోతున్నారు. ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.


Click it and Unblock the Notifications











