నెం.1 కోసం ఆ ఇద్దరు హీరోల మధ్య కొట్లాట : రామ్ చరణ్

By Bojja Kumar

హైదరాబాద్ : టాలీవుడ్ లో నెం.1 ఎవరు? అంటూ గత కొంత కాలంగా చర్చ సాగుతున్న సంగతి తెలిసిందే. ఇక టీవీ ఛానల్స్ లో అయితే ఈ హడావుడి కాస్త ఎక్కువే. మరో వైపు పలువురు టాప్ హీరోల అభిమానులు సోషల్ నెట్వర్కింగ్ సైట్లను వేదిక చేసుకుని మా హీరో నెం.1 అంటే మా హీరోది టాప్ పొజిషన్ అంటూ ఆన్ లైన్ వార్ సాగిస్తున్నారు.

అయితే రామ్ చరణ్ మాత్రం నెం.1 హీరో ఎవరు అనే అంశంపై తనదైన రీతిలో స్పందించారు. ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ మాట్లాడుతూ...'బాలీవుడ్లో నెం.1 కిరీటం కోసం ఇద్దరు హీరోలు కొట్టుకుంటున్నారు. అయితే ఆ గోల మన దగ్గర లేదు. చాలా ఆరోగ్యకరమైన వాతావరణంలో తెలుగు హీరోలమంతా పని చేస్తున్నామన్నారు.

ఈ విషయమై ఇంకా మాట్లాడుతూ...'నాన్నగారి రోజుల్లో కూడా ఇలాంటి పరిస్థితి లేదు. బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున...వీళ్లెవరూ నెం.1 స్థానం గురించి ఆలోచించ లేదు. ఈ జనరేషన్లో మేమంతా కూడా స్నేహపూర్వక వాతావరణంలో పని చేసుకుంటూ వెలుతున్నాం' అని చెప్పుకొచ్చారు రామ్ చరణ్. ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి హీరోలతో తనకున్న స్నేహాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు చెర్రీ.

కాగా...రామ్ చరణ్ నటించిన తొలి బాలీవుడ్ మూవీ 'జంజీర్' తెలుగులో 'తుఫాన్' పేరుతో విడుదలవుతోంది. నిన్న విడుదలైన తుఫాన్ మూవీ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. దీన్ని బట్టి చెర్రీ బాలీవుడ్ ఎంట్రీ గ్రాండ్ గా ఉండటం ఖాయం అని జోష్యం చెబుతున్నారు సినీ విశ్లేషకులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X