కొంత మంది నటన అలానే ఉంటుంది.. పవన్ కళ్యాణ్‌పై రామ్ చరణ్ కామెంట్స్

పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాపై సినీ ప్రేమికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, టాలీవుడ్ సెలెబ్రిటీలు అయితే వకీల్ సాబ్ గురించి, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఆకాశానికెత్తేస్తున్నారు. చిరంజీవి, నాగబాబు వంటి వారు సినిమా గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మీద ప్రశంసలు కురిపించారు. తాజాగా రామ్ చరణ్ అయితే ఏకంగా ప్రెస్ నోట్ కూడా విడుదల చేశాడు.

మెగా రియాక్షన్..

మెగా రియాక్షన్..


వకీల్ సాబ్ సినిమాను చిరంజీవి నిన్న సాయంత్రం చూస్తే.. నాగబాబు మాత్రం స్పెషల్ షోను చూశాడు. నిన్న ఉదయమే బెనిఫిట్ షోను చూసేశాడు. ఇక తమ తమ్ముడైన పవన్ కళ్యాణ్ నటన గురించి ఇద్దరూ కూడా ట్వీట్లు వేసేశారు. చిరంజీవి అయితే ఏకంగా దర్శక నిర్మాతలను సత్కరించేశాడు.

రామ్ చరణ్ అలా..

రామ్ చరణ్ అలా..

రామ్ చరణ్ నేటి ఉదయం స్పెషల్‌గా ట్వీట్ వేశాడు. వకీల్ సాబ్ యూనిట్, పవన్ కళ్యాణ్ నటన గురించి స్పెషల్‌గా పేర్కొన్నాడు. ఎక్కడ చూసినా ఒకే ఒక్క పదం వినబడుతోంది... పవర్ ప్యాక్డ్ బ్లాక్ బస్టర్ అని వినబడుతోంది.. పవన్ కళ్యాన్ గారికి మరో ల్యాండ్ మార్క్ సినిమా వచ్చింది. అంటూ వకీల్ సాబ్ యూనిట్ మొత్తానికి కంగ్రాట్స్ తెలిపాడు.

నటన గురించి..

నటన గురించి..

అలా ట్వీట్ పెట్టినా కూడా రామ్ చరణ్ మనసు సంతృప్తి చెందలేదేమో అందుకే ప్రత్యేకంగా నోట్ కూడా విడుదల చేశాడు. కొంత మంది నటిస్తే.. వాటిని సినిమాల వరకే ఎంజాయ్ చేసి వదిలేయలేం. సినిమా అయిపోయాక మనం వెళ్లిపోతుంటే మనలో ఓ కొత్త ఆలోచనను కలిగించేలా చేస్తాయి. కళ్యాణ్ బాబాయ్ నటన కూడా అలాంటిదే అని రామ్ చరణ్ అన్నాడు.

Recommended Video

Vakeel Saab కి అండగా Mega Family ! | Ram Charan | Pawan Kalyan
అందరికీ థ్యాంక్స్..

అందరికీ థ్యాంక్స్..

ప్రకాష్ రాజ్, నివేదా థామస్, అంజలి, అనన్య అందరూ కూడా అద్భుతంగా నటించేశారు. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పీఎస్ వినోద్ గారి కెమెరా పనితనం.. వకీల్ సాబ్ లాంటి చిత్రాన్ని మాకు ఇచ్చినందుకు వేణు శ్రీరామ్, దిల్ రాజు, శిరీష్ అందరికీ థ్యాంక్స్ అని రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X